పెళ్లి చేసుకున్న బిగ్‌బాస్ ఫేమ్ ట్రాన్స్‌జెండర్ తమన్నా | Bigg Boss Telugu Tamanna Simhadri Husband Details | Sakshi
Sakshi News home page

Tamanna Simhadri: పెళ్లిరోజు.. భర్త ఫొటో పోస్ట్ చేసిన తమన్నా

Apr 1 2026 3:28 PM | Updated on Apr 1 2026 3:35 PM

Bigg Boss Telugu Tamanna Simhadri Husband Details

తెలుగు బిగ్‌బాస్ 3వ సీజన్‌లో పాల్గొన్న ట్రాన్స్‌జెండర్ తమన్నా సింహాద్రి పెళ్లి చేసుకుంది. ఏడాది క్రితమే ఇది జరిగినప్పటికీ.. తొలి వార్షికోత్సవం సందర్భంగా ఇ‍ప్పుడు భర్త ఫొటోని బయటపెట్టింది. సొంతూరికి వెళ్లినట్లు, భర్తతో సెలబ్రేట్ చేసుకున్నట్లు ఇన్ స్టాలో పోస్టులు పెట్టింది. ఈ క్రమంలోనే బిగ్‌బాస్ ఫ్రెండ్స్‌తో పాటు పలువురు నెటిజన్లు ఈమెకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన పొలిటికల్ సెటైరికల్ సినిమా)

విజయవాడకు చెందిన తమన్నా సింహాద్రి.. బిగ్‌బాస్‌ షోతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. ఇందులో రెండు వారాలు మాత్రమే ఉన్నప్పటికీ.. తోటి కంటెస్టెంట్ అయిన యాంకర్ శ్రీముఖికి ఫ్రెండ్ అయిపోయింది. షో అయిపోయినా సరే దాదాపు ఆరేళ్లుగా ఇప్పటికీ వీరిద్దరి మధ్య ఆ స్నేహం కొనసాగుతూనే ఉంది. శ్రీముఖి ఫ్రెండ్స్‌ గ్యాంగ్‌లో తమన్నా కూడా ఒకరు.

గతంలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నప్పుడు శ్రీముఖితో స్నేహం గురించి చెప్పిన తమన్నా.. నా నిజాయితికి శ్రీముఖి ఫిదా అయిందని, నా జీవితంలో శ్రీముఖి లాంటి స్నేహితురాలని చూడలేదని, ఆమెలో నా కూతురిని చూసుకుంటున్నానని చెప్పుకొచ్చింది. నా బంధువులు, రక్త సంబంధీకులు నన్ను దూరం పెడితే.. శ్రీముఖి మాత్రం నన్ను తన కుటుంబ సభ్యురాలిలా చూసుకుందని చెప్పింది. ఇప్పుడు పెళ్లి చేసుకున్న తమన్నా.. భర్త ఎవరు? అతడి పేరు ఏంటి? తదితర విషయాలు మాత్రం బయటపెట్టలేదు.

పుట్టడమే అబ్బాయిగా పుట్టిన తమన్నా అసలు పేరు మస్తాన్. గతంలో ఓ ఇంటర్వ్యూలో తన గతం గురించి చెప్పిన ఈమె.. గుంటూరులో మస్తాన్ బాబా దర్గా ఉంది. నాన్నకు అబ్బాయి కావాలని, అమ్మకు అమ్మాయి పుట్టాలని ఉండేది. ఇద్దరూ దర్గా వద్ద మొక్కుకున్నారు. దేవుడు కన్‌ఫ్యూజ్ అయ్యాడో ఏమో నేను పుట్టాను. నాకు తెలిసి నేను మా అమ్మ కోరిక తీర్చాను.ముంబై వెళ్లి లింగ మార్పిడి చేయించుకున్నాను. హీరోయిన్ తమన్నా ఇండస్ట్రీకి రాక ముందే నేను ఆ పేరు పెట్టుకున్నాను. ఆమెని చూసి పెట్టుకున్నా పేరు కాదు, ఆపరేషన్ తర్వాత నా పేరు మస్తాన్ నుంచి తమన్నాగా మార్చుకుని ఇంటి పేరు సింహాద్రిని కలుపుకున్నానని చెప్పుకొచ్చింది.

ఈమె పెదనాన్న సింహాద్రి సత్యనారాయణ గతంలో టీడీపీ ప్రభుత్వంలో దేవాదాయ శాఖమంత్రిగా పనిచేశారు. తమన్నాకి కూడా రాజకీయాల పట్ల ఆసక్తి ఉంది. దీంతో 2019లో లోకేశ్‌పై మంగళగిరిలో పోటీ చేసింది. 2024లో పిఠాపురంలో పవన్ కల్యాణ్‌పై పోటీగా నిలబడింది. కానీ కనీస ఓట్లు కూడా ఈమెకు పడలేదు.

(ఇదీ చదవండి: ధురంధర్‌ 2 కథ నాది.. కాపీ కొట్టారు: కన్నడ దర్శకుడు)

Advertisement
 
Advertisement
Advertisement