
ఎన్‌వీఎల్ ఆర్ట్స్ పతాకంపై నండూరి రాము నిర్మించిన చిత్రం 'రుద్రమాంబపురం'. ఈ చిత్రానికి మహేష్ బంటు దర్శకత్వం వహించారు. ఇప్పటికే ఈ చిత్రం టీజర్, సాంగ్ రిలీజవ్వగా ఆడియన్స్ నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. ప్రముఖ టాలీవుడ్ డైరెక్టర్ సుకుమార్ చేతుల మీదుగా విడుదల చేశారు.
(ఇది చదవండి: అక్కడ ప్లేట్స్ కడిగిన స్టార్ హీరోయిన్.. కారణం అదే!)
సుకుమార్ మాట్లాడుతూ...'ఎన్‌విఎల్ ఆర్ట్స్ పతాకంపై నిర్మాత నండూరి రాము నిర్మించిన మూలవాసుల కథే రుద్రమాంబపురం.. ఇది మత్స్యకారుల జీవన విధానం, సంస్కృతి, సంప్రదాయాలతో యదార్ధ సంఘటనల ఆధారంగా నిర్మించారు. ఈ సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నా. ఈ సినిమాకు అజయ్ ఘోష్ కథ అందించడం విశేషం.' అని అన్నారు.
కాగా.. ఈ చిత్రంలో శుభోదయం సుబ్బారావు, అజయ్ ఘోష్, అర్జున్ రాజేష్, పలాస జనార్దన్, నండూరి రాము, సాయి, శంకర్, డివి.సుబ్బారావు, ప్రమీల, రజిని శ్రీకళ, రత్నశ్రీ, షెహనాజ్, రజిని, సురేఖ, రమణి ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ మూవీ జులై 6 నుంచి హాట్ స్టార్‌లో స్ట్రీమింగ్ కానుంది.
(ఇది చదవండి: 'సైతాన్' వెబ్ సిరీస్.. ఆ బోల్డ్ సీన్స్ చేసిన నటి ఎవరో తెలుసా?)