
డేవిడ్ వార్నర్ పేరు చెప్పగానే తెలుగు ప్రేక్షకులు ఎగ్జైట్ అయిపోతారు. ఎందుకంటే పేరుకే ఆస్ట్రేలియా క్రికెటర్ గానీ తెలుగు సినిమాలంటే మామూలు ప్రేమ కాదు. ఐపీఎల్‌లో హైదరాబాద్ జట్టుకు ఆడినప్పటి నుంచి ఈ ప్రేమ మొదలైంది. ఇక లాక్ డౌన్‌లో అప్పటి టాలీవుడ్ హిట్ సాంగ్స్ అన్నింటికీ రీల్స్, టిక్ టాక్ వీడియోలు చేసి తెగ వైరల్ అయిపోయాడు.
(ఇదీ చదవండి: ప్రెగ్నెన్సీతో మెగా కోడలు.. కొత్త సినిమా టీజర్ రిలీజ్)
ఇక అసలు విషయానికొస్తే ప్రస్తుతానికి వార్నర్ క్రికెట్ ఆడట్లేదు. కొన్నాళ్ల క్రితమే అంతర్జాతీయ కెరీర్‌కి రిటైర్మెంట్ ప్రకటించేశాడు. ఈ క్రమంలోనే గతంలో తీసుకున్న ఓ ఫొటోని ఇన్ స్టాలో పోస్ట్ చేశాడు. దీనికి రిప్లై ఇచ్చిన ప్రముఖ దర్శకుడు రాజమౌళి.. 'హాయ్ వార్నర్, మహిస్మతి రాజులా మారాల్సిన సమయం ఆసన్నమైంది. రాయల్ హెల్మెట్ నీకు పంపిస్తా' అని చెప్పారు. స్పందించిన వార్నర్.. 'యెస్ ప్లీజ్ సర్' అని రిప్లై ఇచ్చాడు.
గతంలో రాజమౌళి-వార్నర్ కలిసి ఓ ప్రమోషనల్ యాడ్‌లో నటించారు. అప్పటినుంచి వీళ్లిద్దరి మధ్య బాండింగ్ కొనసాగుతున్నట్లు ఉంది. ఇప్పుడు వార్నర్‌కి రాజమౌళి గిఫ్ట్ ఇస్తానని మాట ఇవ్వడం లాంటివి చూస్తుంటే రీ రిలీజ్ సందర్భంగా అంతర్జాతీయంగానూ 'బాహుబలి'ని ప్రమోట్ చేసేందుకు వార్నర్‌తో కలిసి పెద్ద ప్లానే వేస్తున్నాడేమో అనిపిస్తుంది. ఈ ఏడాది అక్టోబరులో 'బాహుబలి' రెండు భాగాల్ని కలిపి ఓ పార్ట్‌గా రీ రిలీజ్ చేయబోతున్నారు.
(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 20 సినిమాలు)
