పవన్‌ మూవీకి దేవిశ్రీ షాకింగ్‌ రెమ్యునరేషన్‌.. ఎన్ని కోట్లు అంటే..?

Devi Sri Prasad Shocking Remuneration For Pawan Kalyan Bhavadeeyudu Bhagat Singh Movie - Sakshi

రాక్‌స్టార్‌ దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం గురించి టాలీవుడ్‌ ప్రేక్షకులకు కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. ఎన్నో సినిమాలకు ఆయన సూపర్‌ డూపర్‌ ఆల్బమ్స్‌ అందించారు.  మెలోడీ అయినా.. ఐటమ్‌ సాంగ్‌ అయినా.. దేవిశ్రీ తర్వాతే ఇంకెవరైనా. ఆయన నుంచి ఒక పాట విడుదలైదంటే.. యూట్యూబ్‌లో రికార్డు క్రియేట్‌ చేయాల్సిందే. అంతలా తన మ్యూజిక్‌తో మెస్మరైజ్‌ చేస్తాడు డీఎస్సీ. కేవలం ఆయన అందించిన సంగీతంతోనే సూపర్‌ హిట్‌ అయినా సినిమాలు చాలా ఉన్నాయి. అందుకే ఆయనకు టాలీవుడ్‌లో చాలా డిమాండ్‌ ఉంది.

ఇటీవల అల్లు అర్జున్‌ పాన్‌ ఇండియా మూవీ ‘పుష్ప’కు కూడా అదిరిపోయే సంగీతాన్ని అందించి అందరిని ఆకట్టుకున్న దేవిశ్రీ.. తాజాగా  మరో క్రేజీ ప్రాజెక్ట్‌కి మ్యూజిక్‌ డైరెక్టర్‌గా వ్యవరించబోతున్నాడు. గబ్బర్‌ సింగ్‌ తర్వాత పవర్‌స్టార్‌ పవన్‌ కల్యాణ్‌, హరీష్‌ శంకర్‌ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం భవదీయుడు భగత్ సింగ్. ఈ మూవీకి దేవిశ్రీ సంగీతం అందిస్తున్నాడు.దీని కోసం దేవి భారీ రెమ్యునరేషన్‌ తీసుకుంటున్నట్లు ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి.

ఈ సినిమా కోసం రాక్‌స్టార్‌ ఏకంగా రూ. 5 కోట‍్లు రెమ్యునరేషన్‌గా తీసుకుంటున్నట్లు సమాచారం. ఇదే గనుక నిజమైతే ఇప్పటి వరకు ఆయన తీసుకున్న అత్యధిక రెమ్యూనరేషన్ ఇదేగా రికార్డు లో నిలుస్తుంది. సాధారణంగా దేవిశ్రీ ఒక్కో సినిమాకు  రూ.3కోట్లు తీసుకుంటారని సమాచారం. పవన్, దేవిశ్రీ లది బ్లాక్ బస్టర్ కాంబినేషన్. వీరి కాంబోలో జల్సా, గబ్బర్ సింగ్, అత్తారింటికి దారేది లాంటి సూపర్ హిట్ మూవీస్ వచ్చాయి. అందుకే భవదీయుడు భగత్ సింగ్‌పై భారీ అంచనాలు ఉన్నాయి. అందుకు తగ్గట్టే డీఎస్పీ అద్భుతమైన సాంగ్స్‌ని కంపోజ్‌ చేసే పనిలో ఉన్నాడట. ఇప్పటికే రెండు పాటలను కంప్లీట్‌ చేసినట్లు  ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తెలిపాడు దేవీశ్రీ. ఈ మూవీ షూటింగ్‌ త్వరలోనే ప్రారంభం కానుంది.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top