అల్లు అర్జున్ కుమారుడికి స్టార్‌ క్రికెటర్ సర్ప్రైజ్ గిఫ్ట్‌ | Cricketer Venkatesh Iyer gives surprise gift to Allu Arjun son | Sakshi
Sakshi News home page

అల్లు అర్జున్ కుమారుడికి ఆర్సీబీ స్టార్‌ క్రికెటర్ సర్ప్రైజ్ గిఫ్ట్‌

May 23 2026 11:58 PM | Updated on May 24 2026 6:03 AM

Cricketer Venkatesh Iyer gives surprise gift to Allu Arjun son

ఓ సినీమా స్టార్‌తో ఓ క్రికెట్ స్టార్‌ కలిసిన అరుదైన క్షణం అభిమానులను ఉత్సాహపరిచింది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా టీమిండియా క్రికెటర్ వెంకటేష్ అయ్యర్‌ను కలిశారు. ఐపీఎల్‌(IPL)లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) తరపున ఆడుతున్న అయ్యర్‌ను బన్నీ అభినందించారు. వీరిద్దరూ కాసేపు సరదాగా ముచ్చటించారు. ఈ సందర్భంగా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ బన్నీ కుమారుడు అల్లు అయాన్‌కు ఓ ప్రత్యేకమైన సర్ప్రైజ్ ఇచ్చారు. తన సంతకంతో కూడిన క్రికెట్ జెర్సీని అయాన్‌కు బహుమతిగా అందించారు.  

ఇక ఈ గిఫ్ట్‌పై అల్లు అర్జున్ సోషల్ మీడియా వేదికగా తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. వెంకటేశ్ అయ్యర్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. 'ప్రతిభావంతుడైన యువ భారత క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్‌ని ఈ రోజు కలవడం చాలా ఆనందంగా ఉంది. అల్లు అయాన్‌కు తన సంతకంతో కూడిన ప్రత్యేకమైన జెర్సీని గిఫ్ట్‌గా ఇచ్చినందుకు ఆయనకు నా ప్రత్యేక కృతజ్ఞతలు. మీ భవిష్యత్తు ప్రయత్నాలన్నింటికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు' అంటూ బన్నీ పోస్ట్ చేశారు.  

ఈ భేటీతో అల్లు అర్జున్ అభిమానులు, క్రికెట్ లవర్స్ ఇద్దరూ ఫుల్ ఖుషీ అవుతున్నారు. సోషల్ మీడియాలో మీమ్స్, కామెంట్స్‌తో తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement