ట్విట్టర్‌లో మెగాస్టార్‌ ఫాలో అయ్యే ఒకే ఒక వ్యక్తి ఆయనే..

Chiranjeevi Follows Only Lyricist Ramajogaiah Sastry On Twitter - Sakshi

మెగాస్టార్‌ చిరంజీవి క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం ఆయన కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. భారీ బడ్జెట్‌తో ఈ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా చిరంజీవికి  సంబంధించిన ఓ వార్త ప్రస్తుతం సోషల్‌ మీడియాలో ట్రెండ్‌ అవుతుంది. ట్విట్టర్‌లో మెగాస్టార్‌ చిరంజీవి ఫాలో అవుతున్న ఒకే ఒక్క వ్యక్తి ఎవరో తెలుసా అంటూ ఓ వార్త హైలెట్‌ అవుతుంది. చిరంజీవి ట్విట్టర్‌లో ఫాలో అవుతున్న ఏకైక వ్యక్తి సినీ గేయ రచయిత రామ జోగ‌య్య శాస్త్రి. ఈ విషయాన్ని చెబుతూ ఓ నెటిజన్‌ రామ్‌జోగయ్య శాస్త్రికి ట్యాగ్‌ చేశారు.

'సర్, మీరు గమనించారో లేదో చిరంజీవి గారు ట్విట్టర్ లో ఫాలో అవుతున్న ఏకైక వ్యక్తి మీరు. మీ సుసంపన్నమైన జ్ఞానానికి అది చిరంజీవి గారు మీకు ఇచ్చిన బహుమతి' అని ట్వీట్‌ చేశారు. దీనిపై స్పందించిన రామ జోగ‌య్య శాస్త్రి.. 'చిరంజీవి స‌ర్ ప్రేమ‌, ఆశీర్వాదాల‌కు ఎప్ప‌టికీ రుణ‌ప‌డి ఉంటాను. కొండంత సంతోషంగా ఉన్నాను' అని ఆ పోస్ట్‌ను షేర్‌ చేశారు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండే చిరంజీవి వ్యక్తిత్వానికి ఇదే నిదర్శనమంటూ చిరు ఫ్యాన్స్‌ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కాగా చిరు కొత్త సినిమా 'ఆచార్య'కు రామ జోగ‌య్య శాస్త్రి పాట‌లు రాసిన‌ విష‌యం తెలిసిందే.

చదవండి : చిరు ఇంటికి నాగార్జున.. వంట చేసిన మెగాస్టార్‌
మరోసారి తొందరపడ్డ చిరంజీవి..షాక్‌లో ఫ్యాన్స్‌!

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top