చిరుత బర్త్‌డే.. స్పెషల్‌ ఫోటో షేర్‌ చేసిన మెగాస్టార్‌ | Chiranjeevi Birthday wishes to ram charan with special photo | Sakshi
Sakshi News home page

చిరుత బర్త్‌డే.. స్పెషల్‌ ఫోటో షేర్‌ చేసిన మెగాస్టార్‌

Mar 27 2026 9:27 AM | Updated on Mar 27 2026 12:19 PM

Chiranjeevi Birthday wishes to ram charan with special photo

మెగాస్టార్‌  కుమారుడు రామ్‌ చరణ్‌ పుట్టినరోజు సందర్భంగా చిరంజీవి శుభాకాంక్షలు తెలిపారు. ఆపై తాను దాచుకున్న మధురమైన ఫోటోలను షేర్‌ చేశారు. చరణ్‌ బాల్యంలో జరుపుకున్న పుట్టినరోజు నాటి ఫోటోను అభిమానులతో మెగాస్టార్‌ పంచుకున్నారు. ఈ సందర్భంగా చరణ్‌పై తనకున్న ప్రేమను సోషల్‌మీడియా ద్వారా తెలిపారు.

చరణ్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ.. ప్రత్యేకంగా చిరు ఇలా అన్నారు. 'చిన్నప్పుడు నా చేయి పట్టుకోవడం నుండి ఈ రోజు ఎంతో మందికి స్ఫూర్తిగా నిలవడం వరకు నీ ఎదుగుదల చూస్తుంటే  నాకు నిజంగా గర్వకారణంగా ఉంది.  సినిమా, వ్యక్తిగత జీవితాన్ని సమతుల్యం చేసుకునే విధానం, కుటుంబం పట్ల నీవు చూపించే బాధ్యత, దేవుని పట్ల నీకున్న విశ్వాసం, క్రమశిక్షణ, విలువలు... ఇవన్నీ నేను చూసిన ప్రతిసారీ నీపై నా ప్రేమ, అభిమానం మరింత బలపడుతూనే ఉన్నాయి. దేవుని ఆశీస్సులు, అభిమానుల ప్రేమ నిన్ను ఉన్నత శిఖరాలకు నడిపించాలని కోరుకుంటున్నాను. ప్రియమైన నా చరణ్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు.' అని చిరు షేర్‌ చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement