టాలీవుడ్ సినీ దిగ్గజం చంద్రమోహన్ చివరి సినిమా ఇదే! | Chandra Mohan Acts In His Last Movie With Gopichand In Oxygen | Sakshi
Sakshi News home page

Chandra Mohan: సినీ దిగ్గజం చంద్రమోహన్ నటించిన చివరి సినిమా ఇదే!

Published Sat, Nov 11 2023 10:43 AM | Last Updated on Sat, Nov 11 2023 1:03 PM

Chandra Mohan Acts In His Last Movie With Gopichand In Oxygen - Sakshi

టాలీవుడ్‌లో తీవ్ర విషాదం నెలకొంది. మరో సినీ దిగ్గజం నింగికెగిసింది. తన వైవిధ్యమైన నటనతో సినీ అభిమానులను అలరించిన సీనియర్ నటుడు  చంద్రమోహన్ తుదిశ్వాస విడిచారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆస్పత్రిలో చికిత్స పొందతూ మరణించారు. ఆయన మృతి పట్ల టాలీవుడ్ సినీనటులు, అభిమానులు, రాజకీయ నాయకులు సంతాపం వ్యక్తం చేశారు. 

1966లొ రంగుల రాట్నంతో ఇండస్ట్రీకి పరిచయమైన చంద్రమోహన్.. దశాబ్దాల పాటు తన కెరీర్‌లో వందల చిత్రాల్లో నటించారు. హీరోగా, నటుడిగా, విభిన్నమైన పాత్రల్లో దాదాపు 900లకు పైగా సినిమాల్లో మెప్పించారు. అలనాటి స్టార్ హీరోయిన్స్, శ్రీదేవి, జయసుధ, జయప్రద లాంటి వారితో సినిమాలు చేశారు. తన 55 ఏళ్ల సినీ కెరీర్‌లో చివరిసారిగా గోపిచంద్ నటించిన ఆక్సిజన్ చిత్రంలో చంద్రమోహన్ కనిపించారు. చంద్రమోహన్ తెలుగుతో పాటు తమిళంలో చాలా చిత్రాల్లో నటించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement