విజయ్‌కాంత్‌ లేరనే వార్త జీర్ణించుకోలేకపోతున్నా: కార్తీ | Sakshi
Sakshi News home page

Vijayakanth: ఆ రోజున విజయ్‌కాంత్‌ సంస్మరణ సభ..

Published Fri, Jan 5 2024 5:04 PM

Captain Vijayakanth Memorial Service On 19 January 2024 - Sakshi

దివంగత నటుడు, డీఎండీకే పార్టీ అధ్యక్షుడు విజయ్‌కాంత్‌కు దక్షిణ భారత సినీ నటీనటుల సంఘం తరపున ఈ నెల 19న సంస్మరణ సభను నిర్వహించనున్నట్లు హీరో, ఆ సంఘం కోశాధికారి కార్తీ తెలిపారు. గత నెల 28న విజయ్‌కాంత్‌ అనారోగ్యంతో మృతి చెందారు. ఆ సమయంలో పలువురు సెలబ్రిటీలు ఆయన భౌతిక కాయానికి నివాళులు అర్పించగా.. కొందరు ఇతర ప్రాంతాల్లో ఉండటం కారణంగా సంతాపం తెలుపలేకపోయారు. అందులో హీరో కార్తీ ఒకరు.

గురువారం చైన్నెకి చేరుకున్న ఆయన తన తండ్రి శివకుమార్‌, సోదరుడు సూర్యతో కలిసి స్థానిక కోయంబేడులోని డీఎండీకే పార్టీ కార్యాలయ ఆవరణలో విజయకాంత్‌ సమాధిని సందర్శించి నివాళులర్పించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. విజయ్‌కాంత్‌ మన మధ్య లేరనే విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నానని వాపోయారు.

దక్షిణ భారత సినీ నటీనటుల సంఘం ఎన్నికల్లో విజయం సాధించిన సందర్భంగా ఆయన్ని కలిసినప్పుడు చాలా ఉత్సాహంగా మాట్లాడారని పేర్కొన్నారు. అధ్యక్షుడు అంటే మార్గదర్శిగా నిలవాలన్నది విజయ్‌కాంత్‌ నుంచే నేర్చుకున్నట్లు తెలిపారు. కాగా జనవరి 19న తమ సంఘం తరపున విజయ్‌కాంత్‌కు సంస్మరణ సభ నిర్వహించనున్నట్లు చెప్పారు.

చదవండి: ఒక కన్నులో ధైర్యం, మరో కన్నులో కరుణ.. అంటూ బోరున ఏడ్చిన సూర్య

Advertisement
 
Advertisement
 
Advertisement