బొమ్మ బ్లాక్‌బ‌స్ట‌ర్‌: ర‌ష్మీ ఫ‌స్ట్ లుక్ రిలీజ్‌

Bomma Blockbuster: Rashmi Gautam As Vani Look Revealed - Sakshi

బుల్లితెర యాంక‌ర్ ర‌ష్మీ గౌత‌మ్ పేరు తెలియ‌ని వాళ్లు ఉండ‌రు. అటు టీవీ షోలు చేస్తూనే అప్పుడ‌ప్పుడు సినిమాల్లోనూ క‌నిపిస్తున్నారు. ఆ మ‌ధ్య వ‌చ్చిన‌ "గుంటూరు టాకీస్" చిత్రంలో అందాల ఆరోబోత‌కే ప్రాధాన్యం ఇచ్చిన ర‌ష్మీ ఇప్పుడు అభిన‌యానికి స్కోప్ ఉన్న పాత్ర‌లో న‌టిస్తున్నారు. ప్ర‌స్తుతం "బొమ్మ బ్లాక్ బ‌స్ట‌ర్" అనే చిత్రంలో న‌టిస్తున్నారు. ఇందులో హీరో నందు పోతురాజు పాత్ర‌ను పోషిస్తున్నారు. అత‌ని ప్రేయ‌సి వాణిగా ర‌ష్మీ అల‌రించ‌నున్నారు. వాణి ఫ‌స్ట్ లుక్‌ను చిత్ర‌యూనిట్ బుధ‌వారం విడుద‌ల చేసింది. (చ‌ద‌వండి: ప్లీజ్‌.. అలా రాయొద్దు!)

కిరీటం ధ‌రించి, ఏడు కొండ‌ల నామం పెట్టుకుని, మెడ‌లో పూల మాల వేసుకున్న ర‌ష్మీ చిరున‌వ్వులు చిందుస్తున్నారు. ఈ గెట‌ప్‌లో ర‌ష్మీ చాలా బాగుందంటూ ఆమె అభిమానులు సంతోషం వ్య‌క్తం చేస్తున్నారు. కాగా ఈ సినిమాలో నందు పూరీ జ‌గ‌న్నాథ్ అభిమానిగా క‌న్పిస్తారు. విజ‌యూభ‌వ బ్యాన‌ర్‌పై ప్ర‌వీణ్ ప‌గ‌డాల‌, బోసుబాబు, ఆనంద్ రెడ్డి, మ‌నోహ‌ర్ రెడ్డి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్ర‌శాంత్ విహారి సంగీత‌మందిస్తున్నారు.

ఇక ఈ చిత్రం నుంచి ఇటీవ‌లే విడుద‌లైన మోష‌న్ పోస్ట‌ర్ ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుంటోంది. ఇదిలా వుంటే ఆ మ‌ధ్య నందు బీబీ గురించి బిగ్ అనౌన్స్ మెంట్.. ఇక ర‌చ్చ ర‌చ్చే అని వ‌రుస పోస్టుల‌తో త‌న అభిమానుల‌ను తెగ ఊరించారు. బీబీ అన‌గానే అంద‌రూ బిగ్‌బాస్ అనుకున్నారు కానీ, అనూహ్యంగా "బొమ్మ బ్లాక్‌బ‌స్ట‌ర్" అంటూ టైటిల్ పోస్ట‌ర్ రిలీజ్ చేశారు. ఎలాగైతేనేం, త‌న సినిమాకు కావాల్సినంత ప‌బ్లిసిటీ చేసుకున్నారు. (చ‌ద‌వండి: టిక్‌టాక్ వీడియోపై ర‌ష్మి ఆగ్ర‌హం)

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top