అల్లు- ‍‍‍అట్లీ రాకా.. ఆ స్టార్ హీరో ఓకే చెప్పారా? | Bollywood Star Hero to have a cameo role in Allu Arjun Atlee Raaka | Sakshi
Sakshi News home page

Raaka Movie: అల్లు- ‍‍‍అట్లీ రాకా.. ఆ స్టార్ హీరో ఓకే చెప్పారా?

Apr 14 2026 7:51 PM | Updated on Apr 14 2026 7:57 PM

Bollywood Star Hero to have a cameo role in Allu Arjun Atlee Raaka

అల్లు అర్జున్-అట్లీ కాంబోలో వస్తోన్న సైన్స్ ఫిక్షన్ యాక్షన్ మూవీ రాకా. ఇటీవల బన్నీ బర్త్ డే సందర్భంగా టైటిల్‌తో పాటు ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఈ లుక్‌లో ఐకాన్ స్టార్ తోడేలు లాంటి లుక్‌లో కనిపించారు. ఈ పోస్టర్ చూస్తుంటే విలన్ పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని దాదాపు రూ.900 కోట్ల భారీ బడ్జెట్‌తో సన్ పిక్చర్‌ నిర్మిస్తోంది. ఈ మూవీలో బాలీవుడ్ భామ దీపికా పదుకొణె హీరోయిన్‌గా కనిపించనుంది. అంతేకాకుండా రష్మిక, జాన్వీ కపూర్, మృణాల్ ఠాకూర్ కూడా ఉన్నారని టాక్ వినిపిస్తోంది.

ఇదిలా ఉండగా.. రాకాకు సంబంధించిన మరో క్రేజీ న్యూస్ ‍వైరల్‌గా మారింది. అట్లీతో జతకట్టి సూపర్ హిట్ కొట్టిన షారూఖ్ ఖాన్‌ ఈ మూవీలో కనిపించనున్నారని లేటేస్ట్ టాక్. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌లో షారుఖ్ ఖాన్ అతిథి పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది.  ఒక చిన్న పాత్ర చేయడానికి బాలీవుడ్ బాద్‌షా ఇప్పటికే అంగీకరించారని సమాచారం. అట్లీతో షారూక్‌కు ఉన్న అనుబంధం వల్లే రాకా మూవీకి ఓకే చెప్పారని ఓ నివేదికలో వెల్లడైంది. అట్లీ తెరకెక్కించిన జవాన్‌లో షారూక్ ఖాన్, దీపికా పదుకొణె జంటగా నటించిన సంగతి తెలిసిందే.

అందువల్లే ఈ మూవీలో నటించడానికి షారూక్ ఖాన్ దాదాపు ఓకే చెప్పారని టాక్. ఇదే నిజమైతే జవాన్ తర్వాత మరోసారి అట్లీతో కలిసి పని చేయనున్నారు.  ఈ విషయంపై  షారుక్‌ టీమ్‌ కొందరు సంప్రదించగా.. వారి నుంచి మాత్రం ఇంకా ఎలాంటి రెస్పాన్స్ రాలేదు. అయితే గతంలో అల్లు అర్జున్‌ 'జవాన్' చిత్రంలో ఒక అతిథి పాత్రలో నటించాల్సి ఉండగా.. పుష్ప: ది రూల్ సినిమా షెడ్యూల్ వల్ల కుదరలేదు. దీంతో 'రాకా' మూవీతోనైనా వీరిద్దరిని స్క్రీన్‌పై చూసే అవకాశం ఆడియన్స్‌కు దక్కనుంది. షారుక్ ఖాన్ రాకాలో అతిథి పాత్రలో కనిపిస్తే ఈ ప్రాజెక్ట్ క్రేజ్ మరింత పెరగనుంది.

 

Advertisement
 
Advertisement
Advertisement