Heer Express: బాలీవుడ్‌లోకి వచ్చిన మరో ప్రేమ కథ | Bollywood Movie Heer Express Movie Now Released In Theaters | Sakshi
Sakshi News home page

Heer Express: బాలీవుడ్‌లోకి వచ్చిన మరో ప్రేమ కథ

Sep 13 2025 4:29 PM | Updated on Sep 13 2025 5:10 PM

Bollywood Movie Heer Express Movie Now Released In Theaters

‘సైయారా’ లాంటి బ్లాక్‌ బస్టర్‌ తర్వాత బాలీవుడ్‌లో మరో లవ్‌ స్టోరీ రిలీజైంది. అదే ‘హీరో ఎక్స్‌ప్రెస్‌’. ’ఓ మై గాడ్’, ‘102 నాట్ అవుట్’ ఫేం ఉమేష్ శుక్లా దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో దివిత జునేజా, ప్రిత్ కమాని హీరోహీరోయిన్లుగా నటించారు. అశుతోష్ రానా, గుల్షన్ గ్రోవర్, సంజయ్ మిశ్రా, మేఘనా మాలిక్ ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషించారు. భారీ అంచనాల మధ్య నిన్న(సెప్టెంబర్‌ 12) విడుదలైన ఈ చిత్రానికి తొలి రోజే హిట్‌ టాక్‌ వచ్చింది.

ఈ సినిమా కథ విషయానికొస్తే.. వంట చేయడంలో ఆసక్తిగల హీర్ వాలియా(దివిత జునేజా) అనే పంజాబీ అమ్మాయి, తన వంట నైపుణ్యాలతో ప్రపంచాన్ని జయించాలని కలలు కంటుంది. సొంతంగా రెస్టారెంట్ ప్రారంభించాలనే లక్ష్యంతో చెఫ్‌గా పనిచేయడానికి లండన్‌కు వెళ్తుంది. 

అక్కడ ఆమెకు ఎదురైన సవాళ్లు ఏంటి, హీర్‌ చివరకు తన లక్ష్యాన్ని చేరుకుందా లేదా? అనేదే మిగతా కథ. ఫ్యామిలీ ఎమోషన్‌, వినోదం, క్యూట్‌ లవ్‌స్టోరీతో అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా సినిమా ఉందని బాలీవుడ్‌ రివ్యూస్‌ చెబుతున్నాయి.  ఇక ఈ చిత్రాన్ని ఉమేష్ శుక్లా, ఆశిష్ వాఘ్, మోహిత్ ఛబ్రా, మరియు సంజయ్ గ్రోవర్ సంయుక్తంగా నిర్మించారు. సంపదా వాఘ్ సహ నిర్మాతగా వ్యవహరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement