ప్రియుడితో హీరోయిన్‌ బ్రేకప్.. ఏడాదికే ఎండ్ కార్డ్..! | Bollywood Actress Sanya Malhotra break up with Rishab Sharma | Sakshi
Sakshi News home page

Sanya Malhotra: ప్రియుడితో దంగల్ నటి బ్రేకప్.. ఏడాదికే గుడ్ బై..!

Apr 8 2026 5:02 PM | Updated on Apr 8 2026 5:07 PM

Bollywood Actress Sanya Malhotra break up with Rishab Sharma

అమిర్‌ ఖాన్‌ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘దంగల్‌’ చిత్రంతో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి సన్యా మల్హోత్రా.  ఈ చిత్రంలో బబితా కుమారి పాత్రలో ఆడియన్స్‌ను మెప్పించింది. ఆ తర్వాత పలు సినిమాలు, షోలలో కనిపించింది. గతేడాది  సన్నీ సంస్కారీ కి తులసి కుమారి,  బేబీ జాన్, ది గ్రేట్ ఇండియన్ కిచెన్‌ లాంటి చిత్రాల్లో కనిపించింది. హిందీలో సినిమాలు చేస్తూ బిజీ ఉంటోన్న ఈ ముద్దుగుమ్మ  టోస్టర్, సుందర్ పూనమ్ ‍అనే సినిమాల్లో నటిస్తోంది. ఈ చిత్రాలు డైరెక్ట్‌గా ఓటీటీల్లోనే రిలీజ్ కానున్నాయి.

అయితే తాజాగా సన్యా మల్హోత్రాకు సంబంధించి బాలీవుడ్‌లో ఓ టాక్ వినిపిస్తోంది. ఏడాదిగా డేటింగ్‌లో ఉన్న సన్యా తన ప్రియుడు రిషబ్ రిఖిరామ్ శర్మ బ్రేకప్ చేసుకున్నట్లు తెలుస్తోంది. తాజాగా వీరిద్దరు ఒకరినొకరు సోషల్ మీడియాలో అన్‌ఫాలో చేసుకోవడంతో బాలీవుడ్‌ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. కాగా.. సన్యా మల్హోత్రా గతేడాది నుంచి ప్రముఖ సితార్ ప్లేయర్ రిషబ్ రిఖిరామ్ శర్మతో డేటింగ్‌లో ఉన్నారు. ఎక్కడికెళ్లినా జంటగా కనిపించి సందడి చేసేవారు. ‍అయితే వీరిద్దరి రిలేషన్‌పై ఎక్కడా కూడా అఫీషియల్‌గా ప్రకటించలేదు. తాజాగా వీరిద్దరు ఏడాదిలోనే తన రిలేషన్‌కు గుడ్‌ బై చెప్పేశారు. రిషబ్ వేరొకరితో డేటింగ్‌లో ఉన్నట్లు సమాచారం. అందుకే సన్యా బ్రేకప్ చెప్పేసినట్లు బీటౌన్‌లో లేటేస్ట్ టాక్. గతంలోనూ ఓసారి తనకు బ్రేకప్ అయినట్లు సన్యా ఓ ఇంటర్వ్యూలో పంచుకుంది. నాలుగేళ్ల లాంగ్‌ రిలేషన్‌ తర్వాత బ్రేకప్ అయినట్లు తెలిపింది.

రిషబ్ రిఖిరామ్ శర్మ ఎవరంటే?

రిషబ్ రిఖిరామ్ శర్మ.. రిఖీ రామ్ కుటుంబానికి చెందిన సితార్ ప్లేయర్, సంగీత స్వరకర్త. పురాణ సితార్ వాద్యకారుల కోసం వాయిద్యాలను రూపొందించడంలో ప్రసిద్ధి చెందారు. అతను దిగ్గజ పండిట్ రవిశంకర్ చివరి శిష్యుడు. సితార్ ఫర్ మెంటల్ హెల్త్, ఉచిత మ్యూజిక్ థెరపీ  ద్వారా మానసిక ఆరోగ్యం కోసం సెషన్స్ నిర్వహిస్తుంటారు. రిషబ్ తన ప్రదర్శనల ద్వారా ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. 2022లో అమెరికాలోని వైట్ హౌస్‌లో నిర్వహించిన మొట్టమొదటి దీపావళి వేడుకలో సోలో ప్రదర్శన ఇచ్చాడు. ఆ తర్వాత పారిస్‌లో జరిగిన 2024 వేసవి ఒలింపిక్స్ ముగింపు వేడుకలో తన ప్రదర్శనతో భారతీయ అథ్లెట్లను అలరించాడు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement