సాహో నటి విడాకులు.. పెళ్లైన ఐదేళ్లకే బంధానికి గుడ్ బై | Bollywood Actress Evelyn Sharma have decided to part ways with Husband | Sakshi
Sakshi News home page

Evelyn Sharma: పెళ్లైన ఐదేళ్లకే సాహో నటి విడాకులు..!

May 1 2026 5:07 PM | Updated on May 1 2026 5:21 PM

Bollywood Actress Evelyn Sharma have decided to part ways with Husband

ప్రముఖ నటి ఎవలీన్ శర్మ తన భర్తతో విడిపోతున్నట్లు ప్రకటించింది. తమ ఐదేళ్ల వివాహా బంధానికి గుడ్‌ బై చెప్పనుంది. ఈ విషయాన్ని తాజా ఇంటర్వ్యూలో వెల్లడించింది. ఈ విషయంపై ఓ ఛానెల్‌లో మాట్లాడిన ఆమె.. అవును మేమిద్దరం పరస్పరం అంగీకారంతోనే విడిపోవాలని నిర్ణయించుకున్నామని తెలిపింది. పిల్లల విషయంలో ఇద్దరం బాధ్యత తీసుకుంటామని పేర్కొంది. ఇలాంటి మేము గోప్యతను కోరుకుంటున్నామని అన్నారు. 

కాగా.. నటి ఎవలిన్ శర్మ 2021 మే 15న డెంటల్ సర్జన్ అయిన తుషాన్ బిందీని పెళ్లాడారు. వీరికి కుమార్తె ఆవా, కుమారుడు ఆర్డెన్ అనే ఇద్దరు పిల్లలు జన్మించారు. పెళ్లైన ఐదేళ్లకే ఈ జంట విడాకులు తీసుకునేందుకు సిద్ధమయ్యారు. స్నేహపూర్వకంగా తమ బంధానికి ముగింపు పలుకుతున్నామని ఎవలీన్ తెలిపారు. తమ పిల్లలను మాత్రం కలిసే పెంచుతామని కూడా స్పష్టం చేశారు. కాగా.. ఎవలీన్ శర్మ 2012లో హిందీ సినీ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చారు. 2019 వరకు పలు హిందీ చిత్రాలలో కనిపించారు. ఆమె 2013లో విడుదలైన 'యే జవానీ హై దీవానీ' మూవీలో మెప్పించింది. అంతేకాకుండా 2014లో విడుదలైన 'యారియాన్', 'మై తేరా హీరో' చిత్రాల్లో కూడా నటించింది. తెలుగులో ప్రభాస్ మూవీ సాహోలో ఐషా పాత్రలో ఆకట్టుకుంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement