Bigg Boss Winner VJ Sunny New Movie Update Check Here - Sakshi
Sakshi News home page

BIgg Boss Winner Sunny Movie: బిగ్ బాస్ విన్నర్ సన్నీ హీరోగా కొత్త సినిమా!

May 27 2022 2:26 PM | Updated on May 27 2022 3:19 PM

Bigg Boss Winner Sunny New Film Update - Sakshi

బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 విన్నర్ సన్నీ హీరోగా కొత్త సినిమా తెరకెక్కనుంది. డైమండ్ రత్నబాబు ఈ సినిమాను డైరెక్ట్ చేయబోతున్నాడు. త్వరలో ప్రారంభం కానున్న ఈ సినిమా టైటిల్ మరియు ఫస్ట్ లుక్ త్వరలో విడుదల కానున్నాయి. సీమశాస్త్రి, పిల్లా నువ్వు లేని జీవితం, ఈడొరకం ఆడోరకం వంటి హిట్ చిత్రాలకు సంభాషణలు అందించిన డైమండ్ రత్నబాబు సన్నీతో సినిమా చేస్తుండడం విశేషం.

సన్నీతో పాటు నటించే హీరోయిన్ ఎవరనేది తెలియాల్సి ఉంది. బిగ్ బాస్ షో ద్వారా యూత్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న సన్నీ హౌస్ నుంచి​ బయటికి వచ్చాక హీరోగా చేస్తున్న చేస్తున్న చిత్రమిది. కమర్షియల్ అంశాలతో పాటు ఫ్యామిలి ఆడియన్స్‌కి కావాల్సిన ఎలిమెంట్స్ ఈ సినిమాలో ఉండబోతున్నాయని సమాచారం. ఈ సినిమాలో నటించే నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలో తెలియనున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement