బిగ్‌బాస్‌ ప్లాన్‌ ఫెయిల్‌? ఈసారి ఆమెను కాపాడటం కష్టమే! | Sakshi
Sakshi News home page

Bigg Boss 7 Telugu: అమ్మాయిలను కాపాడేందుకు విశ్వప్రయత్నాలు.. ఎవిక్షన్‌ ఫ్రీ పాస్‌ గెల్చుకుందెవరంటే? తన ఎలిమినేషన్‌ తథ్యం?!

Published Tue, Nov 14 2023 12:35 PM

Bigg Boss Telugu 7: This Contestant Won Eviction Free Pass - Sakshi

బిగ్‌బాస్‌ తెలుగు ఏడో సీజన్‌లో ఫ్యామిలీ వీక్‌ అయిపోయింది. కంటెస్టెంట్ల ఇంటిసభ్యులు అటు ఇంట్లోకి, ఇటు స్టేజీపైకి వచ్చి మాట్లాడటంతో హౌస్‌మేట్స్‌లో జోష్‌ రెట్టింపయ్యింది. ఆడాలన్న కసి మరింత పెరిగిపోయింది. ఉరకలెత్తుతున్న ఉత్సాహంతో ఈ వారాన్ని ప్రారంభించారు. అయితే ఫ్యామిలీ మెంబర్స్‌ ఇచ్చిన హింట్స్‌ను దృష్టిలో పెట్టుకుని నామినేషన్స్‌ మొదలుపెట్టారు. రతికను గేమ్‌ ఆడమని చెప్తే నామినేషన్స్‌లో తన టాలెంట్‌ చూపించింది.

సా...గదీస్తూ చిరాకు పుట్టిస్తున్న రతిక
ఏదేదో మాట్లాడుతూ.. రెచ్చిపోయి అరుస్తూ తనకు హైప్‌ తెచ్చుకోవాలని ప్రయత్నించింది. కానీ చూసేవాళ్లకు అదంతా కావాలని చేస్తుందని ఇట్టే అర్థం కావడంతో తన ప్రవర్తనకు విసుగెత్తిపోయారు. ఇక ప్రశాంత్‌ క్రేజ్‌ పెరిగిందనుకున్నాడో మరేంటో కానీ అర్జున్‌ అనూహ్యంగా రైతుబిడ్డను నామినేట్‌ చేశాడు. కాకపోతే అతడు చెప్పిన కారణాన్ని మాత్రం మెచ్చుకుని తీరాల్సిందే! నీ ఇండివిడ్యుయాలిటీ కోల్పోతున్నావ్‌, సొంతంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం లేదని చెప్పాడు. ఎప్పుడూ ఒకరి నీడలో ఉండి ఆడుతున్న ప్రశాంత్‌ ఈ పాయింట్‌ను అర్థం చేసుకుంటే అతడి​కే ప్లస్‌ అవుతుంది.

ర్యాంకింగ్‌లో వెనకబడ్డ ఆ ఐదుగురు
ఇకపోతే హౌస్‌లో ర్యాంకింగ్‌ టాస్క్‌ ఇచ్చాడు బిగ్‌బాస్‌. కంటెస్టెంట్లు.. వారికి అర్హత అనిపించే ర్యాంకుల్లో నిలబడాలన్నాడు. దీంతో తొలి స్థానంలో శివాజీ, రెండు, మూడు స్థానాల్లో ప్రిన్స్‌ యావర్‌, పల్లవి ప్రశాంత్‌ నిలబడ్డారు. నాలుగైదు స్థానాల్లో ప్రియాంక, శోభ నిల్చోగా.. తర్వాతి స్థానాల్లో వరుసగా అమర్‌, గౌతమ్‌, అర్జున్‌, అశ్విని, రతిక ఉన్నట్లు తెలుస్తోంది. కానీ ఫినాలేలో ఇదే ఆర్డర్‌ ఉండే అవకాశం లేదు.

ఎవిక్షన్‌ ఫ్రీ పాస్‌ గెల్చుకుంది అతడే
అయితే చివరి ఐదు స్థానాల్లో ఉన్నవారి కోసం బంపరాఫర్‌ ఇచ్చాడు బిగ్‌బాస్‌. ఎవిక్షన్‌ ఫ్రీ పాస్‌ను ప్రవేశపెట్టాడు. అందులో భాగంగా ఓ ఈజీ టాస్క్‌ ఇచ్చాడు. బహుశా అమ్మాయిలను కాపాడటానినే సులువైన టాస్క్‌ పెట్టాడేమో! కానీ బిగ్‌బాస్‌ ఆశలను అడియాశలు చేస్తూ అర్జున్‌ అంబటి పాస్‌ గెల్చుకున్నట్లు తెలుస్తోంది. పాపం.. రతికను కాపాడటానికి బిగ్‌బాస్‌ ఎంత ప్రయత్నిస్తున్నా ఈ వారం తనే ఎలిమినేట్‌ అవడం ఖాయంగా కనిపిస్తోంది.

చదవండి: ఆల్‌రెడీ పెళ్లై విడాకులు తీసుకున్న హీరోతో ఐదేళ్లు సహజీవనం.. పిల్లల కోసమే పెళ్లి..

Advertisement
 
Advertisement
 
Advertisement