Bigg Boss 6 Telugu, Episode 99: ఊహించిందే జరిగింది.. ఈ వారం ఇనయ ఎలిమినేట్ అయింది. ఫినాలేకు ఒక అడుగు దూరంలోనే తన ప్రయాణం ముగిసింది. తన జర్నీని చూసి కన్నీళ్లు పెట్టుకుంది ఇనయ. చివరి నిమిషంలో కెప్టెన్ అవడమే కాకుండా బెస్ట్ కెప్టెన్‌గా అందరిచేత శెభాష్ అనిపించుకుని ఇంటి నుంచి బయటకు వచ్చింది. మరి ఈరోజు ఎపిసోడ్ హైలైట్స్‌లో ఏమేం జరిగాయో చదివేయండి..
బిగ్‌బాస్ హౌస్ గురించి కంటెస్టెంట్లకు ఎంత అవగాహన ఉందో తెలుసుకోవడానికి 'నీకెంత తెలుసు' అనే టాస్క్ ఇచ్చాడు నాగ్. హౌస్‌లో నిత్యం చూసే పరిసరాల గురించి కొన్ని ప్రశ్నలు అడిగాడు. ఇందులో ఎక్కువ ప్రశ్నలకు సమాధానాలు చెప్పిన రేవంత్ గిఫ్ట్ హ్యాంపర్ సొంతం చేసుకున్నాడు. తర్వాత పాటలు, డ్యాన్సులతో ఎంటర్‌టైన్ చేశారు హౌస్‌మేట్స్. నాగ్ అందరినీ సేవ్ చేసుకుంటూ రాగా చివర్లో ఆదిరెడ్డి, ఇనయ మాత్రమే మిగిలారు.
కంటెస్టెంట్లు ఊపిరి బిగపట్టుకుని చూస్తున్న సమయంలో ఇనయ ఎలిమినేట్ అయినట్లు ప్రకటించాడు నాగ్. ఎలాగైనా కప్పు కొట్టాలన్న తన కల నెరవేరకుండానే హౌస్ నుంచి బయటకు వచ్చేయడంతో భావోద్వేగానికి లోనైంది. ఒక్క అడుగు దూరంలో ఆగిపోయానని ఫీలైంది. స్టేజీమీదకు వచ్చిన ఇనయతో ఓ గేమ్ ఆడించాడు నాగ్. టాప్ 6 కంటెస్టెంట్లలో ఉన్న మంచి, చెడు లక్షణాలను చెప్పమన్నాడు.
ఇనయ మాట్లాడుతూ.. శ్రీహాన్‌తో స్టార్ట్ చేస్తాను. అతడు మంచివాడని తర్వాత అర్థమైంది. అతడే టైటిల్ కొట్టి రావాలి. అవతలి వాళ్లను అర్థం చేసుకుంటే బాగుండు, బ్యాక్ బిచింగ్ తగ్గించుకోవాలి. ఆదిరెడ్డి.. నిజాయితీపరుడు. శ్రీసత్య తనకు నచ్చినవాళ్ల కోసం ఏదైనా చేస్తుంది. నచ్చనివాళ్లను విపరీతంగా రెచ్చగొడుతుంది. కీర్తి ఎలాంటి బాధనుంచైనా బయటపడగలదు, కానీ దానికి సమయం పడుతుంది.
రోహిత్ డీసెంట్ గుడ్ బాయ్. కానీ తనలోని సామర్థ్యాన్ని పూర్తిగా బయటపెట్టలేదు. రేవంత్.. అందరితో బాగుంటాడు, అందరికీ ఫుడ్ షేర్ చేస్తాడు. కానీ అందరికీ మంచి చెప్పాలనుకుంటాడు, అది అవతలవాళ్లకు నచ్చదు అని చెప్పుకొచ్చింది. ఇనయను పంపించేసిన నాగ్ మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉంటుందని ప్రకటించాడు. బుధవారం ఒకరిని హౌస్ నుంచి పంపించేస్తామని తెలిపాడు. కాబట్టి హౌస్‌లో ఎవరిని హౌస్‌లో ఉంచాలనుకుంటున్నారో? ఎవరిని ఫినాలేకు పంపించాలనుకుంటున్నారో.. వారికి ఆలస్యం చేయకుండా ఓట్లు గుద్దేయండి..
చదవండి: లేడీ టైగర్‌ను పంపించేస్తారా.. చెత్త సీజన్ అంటూ ట్రోలింగ్
సినిమాలు వర్కవుట్ కాలేదు, చనిపోదామనుకున్నా
Comments
Please login to add a commentAdd a comment