Bigg Boss 6 Telugu: భయపడి చస్తూనే గెలిచేశారుగా, ఇప్పుడు ప్రైజ్‌మనీ ఎంతంటే?

Bigg Boss Telugu 6: Adi Reddy, Shrihan Won Ghost Task - Sakshi

Bigg Boss Telugu 6, Episode 95: ఇప్పటిదాకా నేను ఆడతానంటే నేను ఆడతానని ముందుకు వచ్చిన హౌస్‌మేట్స్‌ ఈరోజు దెయ్యం టాస్కులో మాత్రం నావల్ల కాదు బాబోయ్‌ అంటూ బెంబేలెత్తిపోయారు. అయినా సరే విడిచిపెట్టని బిగ్‌బాస్‌ వారిని చీకటి గదిలోకి పిలిచి ముచ్చెమటలు పట్టేలా చేశాడు. ఇంతకీ ఈ టాస్కులో వారు గెలిచారా? లేదా? అసలు ప్రైజ్‌మనీ లెక్క సెట్టయిందా? అనే విషయాలు తెలియాలంటే నేటి ఎపిసోడ్‌ హైలైట్స్‌ చదివేయాల్సిందే! 

దెయ్యం దెబ్బకు జడుసుకుని చస్తున్నారు హౌస్‌మేట్స్‌. మరీ ముఖ్యంగా దెయ్యం పేరెత్తితేనే వణికిపోతున్నాడు ఆదిరెడ్డి. చూడటానికి తాటిచెట్టులా ఉన్నావు, అలా భయపడతావేంటి భయ్యా అని రేవంత్‌ సెటైర్లు వేశాడు. ఇకపోతే బిగ్‌బాస్‌ ఇంటిసభ్యులకు నేడు ఐదో ఛాలెంజ్‌ ఇచ్చాడు. ఇందులో రోహిత్‌, ఆదిరెడ్డి పాల్గొన్నారు. వీరిలో విజేతను ఎంచుకోండంటూ మిగతా ఇంటిసభ్యులకు తలా ఇరవై వేలు అప్పజెప్పాడు బిగ్‌బాస్‌. ఈ ఛాలెంజ్‌లో ఆదిరెడ్డి విజయం సాధించాడు. శ్రీసత్య మినహా మిగతా నలుగురు ఆదిరెడ్డికి సపోర్ట్‌ చేయడంతో వారి దగ్గరున్న మొత్తం కలిపి రూ.80 వేలు గెలుచుకున్నారని ప్రకటించాడు బిగ్‌బాస్‌.

తర్వాత పరమాన్నం కోసం కప్పులు తెచ్చుకోండని శ్రీహాన్‌కు చెప్పాడు రేవంత్‌. అన్నం తిన్నాక పరమాన్నం తింటే బాగుంటుందని అందరూ అభిప్రాయపడ్డారు. దీంతో రేవంత్‌.. నేను మీకు తినమని చెప్పలేదు, కేవలం రుచి చూడమన్నాననంతేనని మాట మార్చాడు. ఈ మాటతో అవాక్కైన శ్రీహాన్‌, శ్రీసత్య.. ఇందాకే కదా, కప్పులు తెచ్చుకో అన్నావ్‌ అని నిలదీయగా నేను జస్ట్‌ టేస్ట్‌ చూడమన్నాను, ప్రతిదాంట్లో తప్పులు వెతక్కండి అని అలిగాడు. రేవంత్‌కు తన తప్పులు చెప్తే అస్సలు తీసుకోడంటూ అసహనం వ్యక్తం చేశాడు శ్రీహాన్‌.

అనంతరం బిగ్‌బాస్‌ ఇంటిసభ్యులకు ఇచ్చిన ఆరో ఛాలెంజ్‌లో శ్రీహాన్‌, కీర్తి పోటీపడ్డారు. హౌస్‌మేట్స్‌ అందరూ నీకే ఓటేస్తారు కాబట్టి బాగా ఆడి గెలవమని శ్రీహాన్‌కు సిగ్నల్స్‌ ఇచ్చింది కీర్తి. అన్నట్లుగానే ఈ గేమ్‌లో హౌస్‌మేట్స్‌ అందరూ శ్రీహాన్‌కే సపోర్ట్‌ చేయగా అతడు గెలవడంతో ప్రైజ్‌మనీలో రెండు లక్షలు జమయింది. ఈ టాస్కులో కుండ పగలగొట్టగా దాని మట్టి ఏరుకుని తిన్నారు శ్రీసత్య, ఇనయ, కీర్తి. ఇది చూసిన బిగ్‌బాస్‌.. ఇకనుంచి మీకు రేషన్‌కు బదులుగా మట్టి పంపిస్తే సరిపోతుందా అని ఆటపట్టించాడు. తర్వాత ఇంటిసభ్యులకో డిఫరెంట్‌ టాస్క్‌ ఇచ్చాడు. సమయానుసారం కన్ఫెషన్‌ రూమ్‌కి పిలుస్తానని, అప్పుడు తాను చెప్పిన ఆజ్ఞలను పాటిస్తే డబ్బులు లభిస్తాయన్నాడు.

మొదట ఆదిరెడ్డిని పిలిచాడు. కన్ఫెషన్‌ రూమ్‌ గదంతా చీకటిగా ఉండటంతో ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేకపోయాడు ఆది. గదిలోని క్యాండిల్‌ వెతికి బయటకు తీసుకెళ్లమని ఆదేశించాడు బిగ్‌బాస్‌. అతడికి ఎంతసేపటికి క్యాండిల్‌ దొరకకపోవడంతో ఎవరైనా తోడు కావాలా? అని అడిగాడు. దీంతో అతడు శ్రీహాన్‌ పేరు చెప్పాడు. ఇక అప్పటికే భయపడి చస్తున్న ఆదిరెడ్డిని తన భయంతో మరింత హడలెత్తించాడు. ఇద్దరూ భయపడి చస్తూనే వస్తువులను వెతికారు. వీరి భయాన్ని చూసి ప్రేక్షకులు నవ్వాపుకోవడం కష్టమే! ఫైనల్‌గా ఇద్దరూ కలిసి క్యాండిల్‌, గన్‌ సాధించి పట్టుకోవడంతో మరింత డబ్బు జమైంది. ఫైనల్‌గా ఈ రోజు ఎపిసోడ్‌ ముగిసే సమయానికి ప్రైజ్‌మనీ రూ. 44,35,100కి చేరింది.

చదవండి: రేవంత్‌ ఫుడ్‌ గొడవలు, ఇక మారడా?
బుట్టబొమ్మతో లవ్‌లో పడ్డ సల్మాన్‌ ఖాన్‌

మరిన్ని వార్తలు :

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వార్తలు

07-12-2022
Dec 07, 2022, 18:41 IST
అడుగు తీసి అడుగు ముందుకు వేస్తే కదా.. భయంతో ఉన్నచోటనే ఉండిపోయాడు. అతడు భయపడటంతో బిగ్‌బాస్‌ మీకు తోడు కోసం...
07-12-2022
Dec 07, 2022, 15:41 IST
కాస్తో కూస్తో అభిమానగణంతో, ఆటతో విన్నర్‌ అవుతాడనుకున్న రేవంత్‌ తన ప్రవర్తనతో జనాలకు మరింత చికాకు పుట్టిస్తున్నాడు. ప్రతిదానికీ గొడవలు పడుతూ...
06-12-2022
Dec 06, 2022, 22:58 IST
ఇంతలో సడన్‌గా దెయ్యం సౌండ్‌ వినిపించడంతో శ్రీసత్య పరుగెత్తుకుంటూ వెళ్లి శ్రీహాన్‌ బెడ్‌ మీదకు చేరింది. ఇక శ్రీహాన్‌ అయితే...
06-12-2022
Dec 06, 2022, 17:15 IST
ప్రతిసారి అబ్బాయిలు మాత్రమే అంటే ఇంకెందుకు గేమ్స్‌.. మీరే ఆడుకోండి, అమ్మాయిలు ఆడరు అని ఫైర్‌ అయింది. దీనికి రేవంత్‌.....
06-12-2022
Dec 06, 2022, 16:36 IST
13 వారాల తర్వాత హౌస్‌ నుంచి ఎలిమినేట్‌ అయిన ఫైమా తాజాగా బిగ్‌బాస్‌ కెఫె ఇంటర్వ్యూలో పాల్గొంది. వెటకారాన్ని ఎందుకు...
06-12-2022
Dec 06, 2022, 15:52 IST
అందుకోసం కొన్ని టాస్కులు గెలవాల్సి ఉంటుందని, ఎవరు గెలుస్తారో కరెక్ట్‌గా గెస్‌ చేయాలని మెలిక పెట్టాడు. అందుకు సరేనంటూ ఎగిరి...
06-12-2022
Dec 06, 2022, 09:22 IST
బిగ్‌బాస్‌ సీజన్‌-6, ఎపిసోడ్‌ 93 హైలైట్స్‌ : ప్రతి సీజన్‌లో లాగానే ఈసారి కూడా నెంబర్‌ గేమ్‌ టాస్క్‌ జరిగింది. తమ...
05-12-2022
Dec 05, 2022, 12:41 IST
ప్రముఖ రియాలిటీ షో బిగ్‌బాస్‌ 6 తెలుగు 14వ వారంలోకి అడుగుపెట్టింది. గత వారం ఎలిమినేషన్‌లో భాగంగా ఫైమా హౌజ్‌ను...
04-12-2022
Dec 04, 2022, 23:16 IST
రేవంత్‌ను ఫ్రస్టేషన్‌కు బ్రాండ్‌ అంబాసిడర్‌గా పేర్కొంది. ఇక ఫైమాకు చేతిని ముద్దుపెట్టుకుంటే చక్కిలిగిలి పుడుతుందని తెలియడంతో నాగార్జున ఆమె చేతిని...
04-12-2022
Dec 04, 2022, 18:53 IST
ఈ రోజు మరో ఇంట్రస్టింగ్‌ గేమ్‌ ఆడించాడు నాగ్‌. హౌస్‌ నుంచి బయటకు వెళ్లాక జీవితాంతం ఎవరితో ఫ్రెండ్‌షిప్‌ చేస్తారు?...
04-12-2022
Dec 04, 2022, 15:37 IST
ఇక శేష్‌ తనకున్న తెలివితేటలన్నీ ఉపయోగించి కనుక్కునే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో ఆదిరెడ్డి, నువ్వే గీశావా? అని అడగ్గా...
03-12-2022
Dec 03, 2022, 23:37 IST
. దీంతో నాగార్జున.. ఆది నాన్‌సెన్స్‌ మాట్లాడుతున్నావు, ఇకమీదట దీన్ని సాగదీయకుండా ఇక్కడితో ఆ ప్రస్తావనే ఆపేసేయ్‌ అని వేడుకున్నాడు.
03-12-2022
Dec 03, 2022, 17:42 IST
ఈ సమయంలో భార్య పక్కన లేకుండా పోయానని, తన బిడ్డను ఎత్తుకోలేకపోయానని కొంత బాధపడ్డాడు.
03-12-2022
Dec 03, 2022, 16:59 IST
ఈ ఐదు సీజన్స్‌ గమనిస్తే టికెట్‌ టు పినాలే గెలిచినవారిలో రాహుల్‌ సిప్లిగంజ్‌ మినహా ఎవరూ విజేతలుగా నిలవలేకపోయారు. అఖిల్‌...
02-12-2022
Dec 02, 2022, 23:30 IST
చివర్లో ఉన్న రోహిత్‌ ఆడను అన్నందున చివరి నుంచి రెండో స్థానంలో ఉన్న ఫైమాను కూడా తొలగించామని ఇనయ స్పష్టతనిచ్చింది....
02-12-2022
Dec 02, 2022, 20:32 IST
ఈ పోటీలో చివరగా శ్రీహాన్‌, రేవంత్‌ మిగలగా శ్రీహాన్‌ గెలిచి టికెట్‌ టు ఫినాలే సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. నిజానికి...
02-12-2022
Dec 02, 2022, 19:05 IST
అర్జున్ కల్యాణ్‌ అమెరికాలో మాస్టర్స్ చేసి న్యూయార్క్ ఫిల్మ్ అకాడమీలో యాక్టింగ్‌లో శిక్షణ తీసుకున్నాడు. ఉప్మా తినేసింది అనే షార్ట్...
02-12-2022
Dec 02, 2022, 15:47 IST
ఎవరికి వారు నేను ఆడతానంటే నేను ఆడతాననడంతో సంచాలకులైన మిగతా ముగ్గురికి ఆ బాధ్యత అప్పజెప్పాడు. దీంతో ఇనయ.. స్కోర్‌...
02-12-2022
Dec 02, 2022, 08:40 IST
బిగ్‌బాస్‌ సీజన్‌-6 టైటిల్‌ గెలవకముందే సింగర్‌ రేవంత్‌ ఇంట సంబరాలు మొదలయ్యాయి. రేవంత్‌ మొదటిసారి తండ్రయ్యాడు. రేవంత్‌ భార్య అన్విత...
01-12-2022
Dec 01, 2022, 23:33 IST
ఓటమిని జీర్ణించుకోలేని రేవంత్‌ సంచాలకురాలైన కీర్తి కావాలనే మనసులో ఏదో పెట్టుకుని నన్ను తప్పించాలని చూసిందని ఉడికిపోయాడు. ఓడిన ప్రతిసారి...

మరిన్ని వీడియోలు 

Read also in:
Back to Top