పెళ్లిపై తొలిసారిగా స్పందించిన బిగ్‌బాస్‌ బ్యూటీ దివి

Bigg Boss Divi Vadthya Open Up Her Marriage And About Mary Person - Sakshi

సొట్ట బుగ్గ‌ల‌తో బిగ్‌బాస్ ప్రేమికుల‌ను ఆక‌ర్షించిన కంటెస్టెంటు దివి వైద్య‌. ముక్కుసూటిగా మాట్లాడే నైజం, అందంతో హౌజ్​లో తనకంటు ప్రత్యేక గుర్తింపు ఏర్పరుచుకుంది దివి. అయితే అంతకు ముందు సూపర్​ స్టార్​ మహేశ్​ బాబు ‘మహర్షీ’ నటించినప్పటికి రాని గుర్తింపు బిగ్​బాస్​ తర్వాత ఒక్కసారిగా వచ్చింది. దీంతో ఆమెకు సినిమాల్లో వరుస ఆఫర్లు వస్తున్నాయి. ఇప్పటికే క్యాబ్​ స్టోరీస్​ అనే వెబ్ సిరీస్​లో నటిస్తుండగా వరుసగా మెగా హీరోల సినిమాల్లో నటించే అవకాశాన్ని అందిపుచ్చుకుంటోంది. ఇలా బిజీగా అయిపోయిన దివి పలు ఛానల్స్​కు ఇంటర్వ్యూలు ఇస్తూ మరింత తీరక లేకుండా మారిపోయింది.

ఈ క్రమంలో తనకు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను వెల్లడించింది. ఇంతవరకు ఎక్కడ తన వ్యక్తిగత విషయాలపై ఒపెన్ కానీ బిగ్​బాస్​ బ్యూటీ తాజాగా తన పర్సనల్​ లైఫ్​ గురించి పలు విషయాలను పంచుకుంది. కాగా కొంతకాలం కిందట దివి ఓ వ్యక్తితో ప్రేమలో పడిన విషయం తెలిసిందే. కొన్ని కారణాల వల్ల వారిద్దరు బ్రేకప్​ చెప్పుకున్నట్లు ఇప్పికే దివి తల్లి ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది. ఆ అబ్బాయి తమ్ముడు మరణించడంతో పెళ్లి చేసుకుని ఊర్లోనే ఉందాం.. కెరీర్ త్యాగం చెయ్ అని అనడంతో పరస్పర అంగీకారంతో బ్రేక్ అప్ చెప్పుకుందామని దివి అనడంతో వారిద్దరు విడిపోయారట. 

అయితే ఆ తర్వాత దివి మళ్లీ ప్రేమలో పడలేదు. సింగిల్​గా ఉంటుంది. తాజాగా ఇంటర్య్వూలో తన పెళ్లిపై ప్రశ్న ఎదురువగా.. కేరీర్‌ ఇప్పడే స్టార్ట్‌ అయ్యిందని, దానికి ఇంకా టైం ఉందని సమాధానం ఇచ్చింది. ఇక కాబోయే వాడు ఎలా ఉండా లని హోస్ట్‌ అడగ్గా.. ‘అందరి అమ్మాయిలకు ఉన్నట్లే నాకు కూడా కాబోయే వాడు ఇలా ఉండాలనే కోరికలు ఉన్నాయి. నా హైట్ 5.8 కాబట్టి నా కాబోయే భర్త  కనీసం 6.3 అడుగు ఉండాలని కోరుకుంటున్నా. అతడు తెలివైనవాడు అయి ఉండాలి, కష్టపడి పనిచేసే మనస్తత్వం ఉండాలి. అలాగే నన్ను ప్రేమగా చూసుకోవాలి’ అని తెలిపింది. ఇక కష్టసుఖాల్లో తోడుగా ఉండి ధైర్యం చెప్పేవాడు అయితే ఒక అమ్మాయికి అంతకంటే కావలసింది ఏముందని, తనకు కూడా అలాంటి భర్త రావాలని కోరుకుంటున్నానంటు తనకు కాబోయే వాడి ఎలా ఉండాలో స్పష్టం చేసింది. మరీ తనకు దగ్గ అలాంటి లక్షణాలు ఉన్న​ అబ్బాయి దివి లైఫ్​లోకి త్వరలో రావాలని ఆశిద్దాం.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top