
డ్యాన్సర్‌గా గుర్తింపు తెచ్చుకున్న నైనిక అనసురు (Nainika Anasuru) తెలుగు బిగ్‌బాస్ ఎనిమిదో సీజన్‌లోనూ పాల్గొంది. టాస్కుల్లో బాగానే పర్ఫామ్ చేసినప్పటికీ ఫినాలే వరకు వెళ్లలేకపోయింది. కవర్ సాంగ్స్‌తో అలరిస్తున్న ఈ బ్యూటీ తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత విషయాలను, కెరీర్‌లో అనుభవించిన బాధలను పంచుకుంది.
చచ్చిపోవాలని ట్రై చేశా..
నైనిక మాట్లాడుతూ.. 'ఢీ షో చేస్తున్న సమయంలోనే నేను డిప్రెషన్‌కు గురయ్యాను. నా ఫ్యామిలీతో సహా ఎవరూ నా ఫీలింగ్స్ అర్థం చేసుకోలేదని బాధపడ్డాను. ఇంట్లోవాళ్లు పాతకాలం మనుషుల్లా ఆలోచించేవారు. వేధింపులను కూడా కొంతవరకు భరించాలన్నట్లుగా చెప్పేవారు. కానీ, అది నా వల్ల కాదు. ఎవర్నీ ఏమీ అనలేక, ఏం చేయలేక పది మంది ముందు నన్ను నేనే తిట్టుకుని ఏడ్చేదాన్ని. ఎందుకిలా అయిపోతున్నానో అర్థం కాలేదు. చనిపోయేందుకు ప్రయత్నించాను. దాదాపు ఏడాదిపాటు బాధపడుతూ నా జీవితాన్ని వృథా చేసుకున్నాను.
ఇండస్ట్రీలో చీకటి కోణం
కానీ, దానివల్లే నన్ను నేను ఎంత ప్రేమించుకోవాలో తెలిసొచ్చింది. ఇకపోతే ఇండస్ట్రీలో అందరూ నిలదొక్కుకోలేరు. నిజాయితీగా మాట్లాడాలంటే నాకు ఓ కూతురుంటే తనను ఈ ఇండస్ట్రీకి అస్సలు పంపించను. వద్దని చెప్పేస్తా! ఇండస్ట్రీలో చాలా చీకటికోణాలున్నాయి. అవన్నీ ఇప్పుడు సర్వసాధారణమైపోయాయి. కాస్టింగ్ కౌచ్‌లాంటివి ఫేస్ చేశాను. కొందరు డైరెక్ట్‌గా కాల్ చేసి మరీ అడుగుతుంటారు. సినిమా ఆఫర్లు ఇచ్చి కమిట్‌మెంట్స్ అడిగారు. అందరూ గలీజ్ అయిపోయారు.
దరిద్రంగా తయారైంది
ఈ మధ్య నాకు ఓ రియల్ ఎస్టేట్ గ్రూప్ నుంచి ఫోన్‌కాల్ వచ్చింది. బ్రాండ్ ప్రమోషన్ కోసం అనుకున్నా.. కాదు, పర్సనల్ అన్నారు. ఆయనేమంటున్నారో అర్థం కాకపోయినా డీల్ ఏంటో చెప్పండి అన్నాను. అందుకతడు.. మీ గురించి బయట ఓ ప్రచారం జరుగుతోంది. మీకు ఓ రేట్ ఫిక్స్ చేస్తున్నారు. మీ ఫోటోలతో పాటే ఆ రేట్స్ కూడా సర్క్యులేట్ చేస్తున్నారు అన్నాడు. దీన్నిబట్టే అర్థం చేసుకోవచ్చు.. ఈ ఇండస్ట్రీ ఎంతో దరిద్రంగా తయారైందనేది! అని నైనిక బాధపడింది.
ముఖ్య గమనిక: ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com
చదవండి: ఆ నలుగురు ఫేక్.. నమ్మకం పోతే మళ్లీరాదంటూ ఏడ్చేసిన శ్రష్టి