పొరపాటున ఒక చుక్క చూపించా.. అంతే: బిగ్‌బాస్‌ ఫేమ్ అర్జున్‌ | Sakshi
Sakshi News home page

Bigg Boss Ambati Arjun: నాకు జీవితాంతం చుక్కలే: అంబటి అర్జున్‌ పోస్ట్‌ వైరల్!

Published Thu, Feb 22 2024 11:36 AM

Bigg Boss Ambati Arjun wishes his Wife On The Special Day Occassion - Sakshi

బిగ్‌బాస్‌ సీజన్- 7 కంటెస్టెంట్‌ అర్జున్‌ అంబటి ఇటీవలే తండ్రి అయిన సంగతి తెలిసిందే. అర్జున్‌ భార్య సురేఖ జనవరి 9న పండంటి ఆడ బిడ్డకి జన్మనిచ్చింది. ఈ విషయాన్ని అర్జున్‌ సోషల్‌ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. తన కూతురుకి ఆర్ఖా అని నామకరణం చేశాడు. గతేడాది వెల్డ్‌ కార్డ్‌ ద్వారా ఎంట్రీ ఇచ్చిన అంబటి అర్జున్‌ టాప్‌-6 కంటెస్టెంట్స్‌లో ఒకరిగా నిలిచారు. అర్జున్‌ బిగ్‌ బాస్‌ హౌస్‌లో ఉండగానే ఆయన భార్య సురేఖ కూడా వచ్చింది. ఆ సమయంలో హౌస్‌లో సీమంతం వేడుక కూడా నిర్వహించారు. 

(ఇది చదవండి: తండ్రి అయిన ‘బిగ్‌బాస్‌’ అర్జున్‌.. ఏం పేరు పెట్టారంటే..?)

తాజాగా అర్జున్ చేసిన పోస్ట్‌ వైరల్‌గా మారింది. తన పెళ్లి రోజును గుర్తు చేసుకుంటూ సోషల్ మీడియా వేదికగా తన భార్యకు విషెస్ తెలిపారు. పొరపాటున ఒక్కరోజు ఒక చుక్క చూపించా.. కానీ నాకు మాత్రం జీవితాంతం చుక్కలు చూపిస్తున్నావ్.. మనకు ప్రత్యేకమైన రోజున శుభాకాంక్షలు అంటూ పోస్ట్ చేశారు. బుధవారం అర్జున్‌- సురేఖ వివాహా వార్షికోత్సవం సందర్భంగా ఇలా తన భార్యపై ప్రేమను చాటుకున్నారు. కాగా..అంబటి అర్జున్‌ ప్రస్తుతం బుల్లితెరపై షోలు, సీరియల్స్‌తో పాటు సినిమాల్లో కూడా నటిస్తున్నాడు. త్వరలోనే ఓ సినిమాలో హీరోగా నటించబోతున్నట్లు తెలుస్తోంది.

Advertisement
 
Advertisement
 
Advertisement