Bigg Boss 6: ‘బిగ్‌బాస్‌’హౌస్‌లో తన్నులాట..ఫైమాను ఈడ్చి పడేసిన ఇనయా! | Bigg Boss 6 Telugu Latest Promo: Fight Between Inaya Sultana And Faima | Sakshi
Sakshi News home page

Bigg Boss 6: ‘బిగ్‌బాస్‌’హౌస్‌లో తన్నులాట..ఫైమాను ఈడ్చి పడేసిన ఇనయా!

Nov 8 2022 5:55 PM | Updated on Nov 8 2022 5:55 PM

Bigg Boss 6 Telugu Latest Promo: Fight Between Inaya Sultana And Faima - Sakshi

బిగ్‌బాస్‌ హౌస్‌లో మొన్నటివరకు ఇనయా, ఫైమా బెస్ట్‌ ఫ్రెండ్స్‌గా ఉన్నారు. సూర్య హౌస్‌లో ఉన్నంత కాలం వీరంతా కలిసి మెలిసి గేమ్‌ ఆడారు. ఎప్పుడైతై సూర్య ఎలిమినేట్‌ అయ్యాడో.. అప్పటి నుంచి ఫైమా, ఇనయాల మధ్య దూరం పెరిగింది. పదో వారం కెప్టెన్సీ టాస్క్‌ వీరిద్దరిని మరింత దూరం చేసినట్లు తెలుస్తుంది. ఈ వారం కెప్టెన్సీ పోటీదారుల టాస్క్‌గా ‘పాము- నిచ్చెన’ ఆట ఇచ్చాడు. దీనిలో భాగంగా ఇంటి సభ్యులు రెండు టీమ్‌లుగా విడిపోయి మట్టితో పాము, నిచ్చెనలను కట్టారు. ఈ క్రమంలో ఇనయా, ఫైమా గొడవకు దిగినట్లు తెలుస్తోంది.  

తాను కట్టిన నిచ్చెన నుంచి మట్టిని తీసుకెళ్లేందుకు ప్రయత్నించిన ఫైమాను..ఇనయా ఈడ్చి బయటకు నెట్టేసింది.  అలాగే ఫైమా కట్టిన పాము నుంచి మట్టిని లాక్కునేందుకు ప్రయత్నించింది. ఈ క్రమంలో ఇనయా, ఫైమాలు కిందపడి ఒకరినొకరు జుట్టులు పట్టుకొని కొట్టుకున్నారు.. ఇనయా అయితే ఫైమా రెండు చేతులను వెనక్కి లాగేందుకు ప్రయత్నించింది.  ‘ఇనయా తప్పు చేస్తున్నావు.. చేయి విరిగిపోతుంది’ రేవంత్‌ చెప్పినా వినలేదు.  చివరకు బిగ్‌బాస్‌ ఆదేశాలతో ఇనయాను గేమ్‌ నుంచి ఔట్‌ చేసింది ఫైమా.  దీంతో ‘ఈ హౌస్‌లో వరస్ట్‌ గేమర్‌ ఫైమా’అంటూ ఇనయా ఇంట్లోకి వెళ్లిపోయింది. మరి టాస్క్‌లో గెలిచి ఎవరు కెప్టెన్సీ పోటీదారులుగా నిలిచారో తెలియాలంటే నేటి ఎపిసోడ్‌ చూడాల్సిందే. 

Advertisement
 
Advertisement
Advertisement