సీరియ‌ల్‌లా సాగదీస్తున్న క‌ట్ట‌ప్ప ఎపిసోడ్‌

Bigg Boss 4 Telugu: Kattappa Suspense Continues - Sakshi

బిగ్‌బాస్ ఇచ్చిన ఫిజిక‌ల్ టాస్క్ ఇంటిస‌భ్యులు పూర్తి చేయ‌లేక‌పోయారు. దీనికి కూడా క‌ట్ట‌ప్పే కార‌ణ‌మ‌ని ప‌రోక్షంగా చెప్పాడు. దీంతో ప్ర‌తిదానికి అడ్డుప‌డుతున్న ఈ క‌ట్ట‌ప్ప ఎవ‌ర్రా బాబూ అని హౌస్‌మేట్స్ త‌ల‌లు ప‌ట్టుకున్నారు. ఇదిలా వుంటే వ‌య‌సు అనేది కేవ‌లం నెంబ‌ర్ మాత్ర‌మేన‌ని నిరూపించిది గంగ‌వ్వ‌. 60 ఏళ్లున్న అవ్వ‌ ఈ రోజు కూడా ఉద‌యం లేవ‌గానే అబ్బాయిల‌తో పోటీ ప‌డుతూ ఎక్సర్‌సైజ్ చేసి అంద‌రినీ ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. ఆ త‌ర్వాత కిచెన్ క్లీన్‌గా ఉంచాల‌ని మోనాల్ చెప్తే అమ్మ రాజ‌శేఖ‌ర్ కాస్త అస‌హ‌నం ప్ర‌ద‌ర్శించాడు. వంట చేయ‌డం, క్లీన్ చేయ‌డం ఒకేసారి ఎలా అవుతుంద‌ని ప్ర‌శ్నించాడు. అత‌ని స‌మాధానం న‌చ్చని క‌ల్యాణి ఈరోజు భోజ‌నం చేయ‌న‌ని ఉప‌వాసం ఉంటున్నాన‌ని చెప్పింది. అస‌లే ఎలాంటి పండ్లు కూడా లేవ‌ని మోనాల్ న‌చ్చ‌చెప్పే ప్ర‌య‌త్నం చేసిన‌ప్ప‌టికీ ఆమె విన‌కుండా వెళ్లిపోయింది. (బిగ్‌బాస్‌పై ఐపీఎల్‌ ఎఫెక్ట్‌!)

అరేంజ్‌డ్ మ్యారేజ్ చేసుకుంటా: మోనాల్‌
ఇవాళేంటో అంద‌రూ హుషారుగా క‌నిపించారు. కిచెన్‌లో అమ్మ రాజ‌శేఖ‌ర్‌, దివి ఒక‌రిపై ఒక‌రు తెగ ప్రేమ కురిపించుకున్నారు. బిగ్‌బాస్‌లో ఉన్నంత‌సేపు నువ్వు హీరోయిన్, నేను హీరో.. అని చెప్పుకొచ్చాడు దివితో క‌బుర్లు చెప్పుకుంటూ నూనె‌లో టీ పొడి వేశాడు. దీంతో నోయ‌ల్ ఆ ఇద్ద‌రినీ నూనె, టీ పొడితో పోలుస్తూ అవి రెండూ క‌ల‌వ‌వు అని పంచ్ వేశాడు. అటు మోనాల్‌, అభిజిత్ ఒక‌రి గురించి మ‌రొక‌రు మ‌రింత లోతుగా తెలుసుకునే ప్ర‌య‌త్నం చేశారు. ఆ త‌ర్వాత మోనాల్ త‌న‌కు పెద్ద‌లు కుదిర్చిన పెళ్లే చేసుకుంటాన‌ని అఖిల్‌తో చెప్పుకొచ్చింది. ప్ర‌స్తుతానికైతే ఎలాంటి రిలేష‌న్‌షిప్‌లో లేన‌ని స్ప‌ష్టం చేసింది.  ఇక‌ నోయ‌ల్ ఇంటి స‌భ్యుల మీద ర్యాప్ సాంగ్ పాడితే మెహ‌బూబ్‌, దేవి, దివి క‌లిసి నోయ‌ల్ మీదే ర్యాప్ పాడి ఔరా అనిపించారు. (సూర్య కిర‌ణ్ త‌గ్గించుకుంటే మంచిది: దివి)

మ‌రోసారి క‌ట్ట‌ప్ప టాస్క్‌
సోహైల్‌.. అఖిల్‌, లాస్య, హారిక‌‌, క‌ల్యాణి.. సూర్య‌కిర‌ణ్‌, మోనాల్, గంగ‌వ్వ‌‌.. అమ్మ రాజ‌శేఖ‌ర్‌, అరియానా, దేవి, దివి, అమ్మ రాజ‌శేఖ‌ర్, సూర్య‌కిర‌ణ్‌,‌.. నోయ‌ల్‌, అఖిల్‌, మెహ‌బూబ్‌, సుజాత, అభిజిత్‌‌.. లాస్యపై స్టాంపు గుద్దారు. నోయ‌ల్ వంతు వ‌చ్చేస‌రికి మాత్రం కాస్త సీన్ క్రియేట్ చేశాడు. త‌న‌కు ఎవ‌రినీ బాధ‌పెట్టడం ఇష్టం లేద‌ని అందుకే తన ముఖంపైనే ముద్ర వేసుకుంటున్న‌ట్లు వెల్ల‌డించాడు. అయితే ఈ నిర్ణ‌యాన్ని ఇంటి స‌భ్యులు తీవ్రంగా వ్య‌తిరేకించారు. అలా చేస్తే నిజ‌మైన క‌ట్ట‌ప్ప నువ్వే అవుతావ‌ని వారించారు.

నోయ‌ల్ చ‌ర్య‌ను ఖండించిన బిగ్‌బాస్‌
అయిన‌ప్ప‌టికీ నోయ‌ల్ త‌న మ‌న‌సు మార్చుకోక‌పోవ‌డంతో బిగ్‌బాస్ రంగంలోకి దిగాడు. నీకు నువ్వు స్టాంప్ వేసుకోడానికి వీల్లేద‌ని చెప్పాడు. దీంతో నోయ‌ల్‌.. లాస్య మీదే అనుమానం ఉన్న‌ప్ప‌టికీ ఆమె ఎక్క‌డ‌ బాధ‌ప‌డుతుందోన‌ని అమ్మ రాజ‌శేఖ‌ర్‌కు స్టాంప్ గుద్దాడు. ఈ తంతు ముగిసిన త‌ర్వాత బిగ్‌బాస్‌.. ఈ క‌ట్ట‌ప్ప ఎవ‌ర‌నేది ఇప్ప‌ట్లో తెలియ‌జేయ‌న‌ని, కానీ త్వ‌ర‌లో మీకే తెలుస్తుందంటూ పెద్ద‌ ట్విస్ట్ ఇచ్చాడు. అనంత‌రం రాత్రి మాస్ట‌ర్‌.. ఇంటి స‌భ్యులు గ్యాంగ్‌గా విడిపోవ‌డంపై జోకులు వేశాడు. ఇప్పుడు హాయిగా స‌ర‌దాగా న‌వ్వుకుంటున్న ఇంటి స‌భ్యుల్లో ఎలిమినేష‌న్ నుంచి ఎవ‌రు గ‌ట్టెక్కుతారు? ఎవ‌రు అవుట్ అవుతార‌నేది రానున్న ఎపిసోడ్ల‌లో తేల‌నుంది. (ఇద్ద‌రిని ఏడిపించిన అరియానా)

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

మరిన్ని వార్తలు

30-10-2020
Oct 30, 2020, 23:29 IST
బిగ్‌బాస్ హౌస్‌లో కంటెస్టెంట్ల ప్ర‌యాణం 55 రోజుల‌కు చేరుకుంది. ప‌రిచ‌యాలు, స్నేహాలు, అల్ల‌ర్లు, అల‌క‌లు, కోపాలు, క‌న్నీళ్లు, గెలుపులు, గాయాలు,...
30-10-2020
Oct 30, 2020, 20:58 IST
తెలుగు ప్రేక్ష‌కులకు ద‌గ్గ‌ర‌వుతానంటూ బిగ్‌బాస్ నాల్గో సీజ‌న్‌లో పాల్గొన్న కంటెస్టెంటు మోనాల్ గ‌జ్జ‌ర్ మీద ఎంత‌టి వ్య‌తిరేక‌త ఉందో అంద‌రికీ తెలిసిందే....
30-10-2020
Oct 30, 2020, 19:45 IST
తెలుగు ప్రేక్ష‌కులంద‌రినీ చూపు తిప్పుకోకుండా టీవీల‌కే అతుక్కుపోయేలా చేసే షో బిగ్‌బాస్ రియాలిటీ షో. మొద‌ట్లో కాస్త వెన‌క‌బ‌డిన నాల్గో సీజ‌న్‌...
30-10-2020
Oct 30, 2020, 17:41 IST
"నాకు పెళ్లైంది, గ‌ర్భ‌వ‌తిని, గుజ‌రాతీలో భ‌ర్త పేరు చెప్ప‌కూడ‌దు.." అంటూ బిగ్‌బాస్ షోలో మోనాల్‌.. అఖిల్‌ను ఆట‌ప‌ట్టించిన విష‌యం తెలిసిందే. అయితే...
30-10-2020
Oct 30, 2020, 16:39 IST
'ఎన్నాళ్లో వేచిన‌ హృద‌యం.. ఈ వారం ఎదుర‌వుతుంటే..' అని బిగ్‌బాస్ ప్రేమికులు సోమ‌వారం నుంచి తెగ పాట‌లు పాడేసుకుంటున్నారు. అందుకు కారణం...
30-10-2020
Oct 30, 2020, 15:47 IST
బిగ్‌బాస్ నాల్గో సీజ‌న్‌లో అనారోగ్య స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్న నోయ‌ల్ చికిత్స నిమిత్తం షో నుంచి స్వ‌ల్ప విరామం తీసుకుంటున్నాడు. మ‌ళ్లీ...
30-10-2020
Oct 30, 2020, 07:54 IST
‘నీకు అమ్మాయిని వెతకమంటావా... నా సెలెక్షన్‌ను ఒప్పుకుంటావా’ అని సమంత అడిగితే ‘నీ సెలక్షన్‌  ఎంత బాగుంటుందో అన్నయ్యను చూస్తే...
29-10-2020
Oct 29, 2020, 23:20 IST
అనారోగ్యంతో అవ‌స్థ ప‌డుతున్న నోయ‌ల్.. గంగ‌వ్వ లాగే బిగ్‌బాస్‌ షో నుంచి అనూహ్యంగా వెళ్లిపోయాడు. దీంతో ఇంటిస‌భ్యులు భారంగా వీడ్కోలు ప‌లికారు. కానీ...
29-10-2020
Oct 29, 2020, 20:22 IST
బిగ్‌బాస్ ప్రేమికుల‌కు, నోయ‌ల్ అభిమానుల‌కు చేదువార్త‌. మిస్ట‌ర్ కూల్ నోయ‌ల్ అనారోగ్య స‌మ‌స్య‌ల‌తో ఇంటి నుంచి బ‌య‌ట‌కు వచ్చేశాడు. ఈ...
29-10-2020
Oct 29, 2020, 19:45 IST
సొట్ట‌బుగ్గ‌ల సుంద‌రి దివి వైద్య బిగ్‌బాస్ నాల్గో సీజ‌న్ నుంచి ఈ మ‌ధ్యే ఎలిమినేట్ అయింది. మాట‌ల క‌న్నా చేత‌ల‌కు...
29-10-2020
Oct 29, 2020, 17:18 IST
బిగ్‌బాస్ నాల్గో సీజ‌న్‌లో ఇప్ప‌టివ‌ర‌కు చోటు చేసుకున్న పెద్ద అద్భుత‌మంటే.. అక్కినేని కోడ‌లు స‌మంత హోస్ట్‌గా రావ‌డ‌మే. స్టార్ హీరోయిన్...
29-10-2020
Oct 29, 2020, 16:13 IST
బిగ్‌బాస్ హౌస్‌లో బీబీ డే కేర్ అనే ల‌గ్జ‌రీ బ‌డ్జెట్ టాస్క్ విజ‌య‌వంతంగా ముగిసింది. అంద‌రి ద‌గ్గ‌రా చాక్లెట్లు కొట్టేసి...
29-10-2020
Oct 29, 2020, 15:43 IST
ప్రేక్ష‌కుల స‌హ‌నానికి ప‌రీక్ష‌గా మారిన బీబీ డేకేర్ టాస్క్‌కు బిగ్‌బాస్ శుభంకార్డు ప‌లికిన విష‌యం తెలిసిందే. అయితే ఈ టాస్కులో చంటిపిల్ల‌లా...
28-10-2020
Oct 28, 2020, 23:04 IST
బీబీ డే కేర్ బిగ్‌బాస్ హౌస్‌లోని కేర్‌టేక‌ర్ల‌కు మాత్ర‌మే కాదు, బ‌య‌ట ప్రేక్ష‌కుల‌కు కూడా విసుగును తెప్పించింది. దీంతో బిగ్‌బాస్‌...
28-10-2020
Oct 28, 2020, 18:17 IST
పిల్ల‌లు దైవస‌మానం అంటారు. కానీ పిల్ల‌ల్లా అవ‌తార‌మెత్తిన బిగ్‌బాస్ కంటెస్టెంట్లు మాత్రం రాక్ష‌సుల్లా మారిపోయి హౌస్‌లో అరాచ‌కం సృష్టిస్తున్నారు. కేర్...
28-10-2020
Oct 28, 2020, 17:16 IST
ఏ పాత్ర‌లోనైనా ఒదిగిపోయే హీరోయిన్ స‌మంత‌. అక్కినేని ఇంటి కోడ‌లిగా అడుగుపెట్టిన ఆమె పెళ్లి త‌ర్వాత విభిన్న పాత్ర‌ల్లో న‌టిస్తూ...
28-10-2020
Oct 28, 2020, 16:24 IST
నేనేమైనా బేకార్ గాడినా, నీతో కూర్చుని మాట్లాడ‌టం త‌ప్పితే నాకు వేరే ప‌నే లేదా? 
27-10-2020
Oct 27, 2020, 23:16 IST
బిగ్‌బాస్ ఇంట్లో చిన్న‌పిల్లలు ఉంటే ఎలాగుంటుంది అనేది క‌ళ్ల‌కు క‌ట్టిన‌ట్లు చూపించారు హౌస్‌మేట్స్‌. టాస్క్‌లో భాగంగా చిన్న‌పిల్ల‌ల్లా మారిపోయిన కంటెస్టెంట్లు...
27-10-2020
Oct 27, 2020, 20:00 IST
ఈ సీజ‌న్ క‌న్నా రెండో సీజ‌నే చాలా బెట‌ర్‌..
27-10-2020
Oct 27, 2020, 18:57 IST
గ‌తం గ‌త‌: అనే మాట‌ వినే ఉంటారు. ఇది దేనికైనా వ‌ర్తిస్తుందేమో కానీ బిగ్‌బాస్‌కు వ‌ర్తించ‌దు. ఎందుకంటే సీజ‌న్లు మారినా...
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top