'కుంభమేళా' మోనాలిసాకు బిగ్‌ షాక్‌.. భర్తపై పోక్సో కేసు! | Big Twist In Kumbh Mela Monalisa Marriage | Sakshi
Sakshi News home page

'కుంభమేళా' మోనాలిసాకు బిగ్‌ షాక్‌.. భర్తపై పోక్సో కేసు!

Apr 10 2026 11:05 AM | Updated on Apr 10 2026 11:50 AM

Big Twist In Kumbh Mela Monalisa Marriage

ప్రయాగ్‌రాజ్‌ మహా కుంభమేళాలో పూసలు అమ్ముతూ ఫేమస్‌ అయిన మోనాలిసా భోంస్లే పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది మార్చి 11న కేరళలోని అరుణ్మనూర్‌లోని శ్రీ నారాయణ గురు ఆలయంలో ఆమె ప్రియుడు ఫర్మాన్‌ ఖాన్‌ని వివాహం చేసుకుంది. అయితే పెళ్లి రోజుకి మోనాలిసా ఇంకా మైనరే అని..ఆమె వయసు 16 ఏళ్లు మాత్రమేననే ఆరోపణలు వచ్చాయి.  దీనికి  జాతీయ షెడ్యూల్డ్ తెగల కమిషన్ (NCST) విచారణ జరపగా..అది నిజమేనని తేలింది. దీంతో మోనాలిసా భర్త ఫర్మాన్‌ ఖాన్‌పై పోక్సో కేసు నమోదు చేశారు. 

అసలేం జరిగింది?
మహాకుంభమేళాలో తన అందం, అభినయంతో నెటిజన్ల మనసు గెలుచుకున్న మోనాలిసా.. పెద్దలను ఎదురించి, ఫేస్‌బుక్‌ ద్వారా పరిచమైన ఫర్మాన్‌ ఖాన్‌ని పెళ్లి చేసుకుంది. అయితే అప్పటికి ఆమె మైనర్‌ అని, ఫర్మాన్‌ ఆమెను  ప్రలోభపెట్టి వివాహం చేసుకున్నారని గత కొద్దిరోజులుగా ప్రచారం సాగింది. మోనాలిసా మైనర్‌ అని,   ఈ వివాహం చెల్లదంటూ విశ్వహిందూ పరిషత్ (VHP) కేరళ విభాగం  కూడా పోలీసులకు ఫిర్యాదు చేసింది.  

దీనిపై జాతీయ షెడ్యూల్డ్ తెగల కమిషన్ రంగంలోకి దిగి లోతుగా విచారణ చేపట్టింది. కమిషన్ జరిపిన విచారణలో మోనాలిసా వయస్సు 18 ఏళ్ల కంటే తక్కువని, ఆమె మైనర్ అని ఆధారాలతో సహా తేలింది.  పెళ్లి రోజుకు ఆమె వయసు 16 సంవత్సరరాల 2 నెలల,12 రోజులు మాత్రమేనని తేలడంతో భర్త ఫర్మాన్‌పై  మధ్యప్రదేశ్‌ పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement