Bachelorette Party In Capri & Marriage Caremony At Tirupathi Is Janhvi Kapoor's Dream - Sakshi
Sakshi News home page

Janhvi Kapoor: అలాంటి అబ్బాయితో తిరుపతిలో నా పెళ్లి!

Aug 3 2021 12:02 AM | Updated on Aug 3 2021 10:59 AM

Bachelorette Party In Capri Marriage Ceremony Tirupati: Janhvi Kapoor - Sakshi

శ్రీదేవి ముద్దుల కుమార్తె జాన్వీ కపూర్‌కి యూత్‌లో బోలెడంత క్రేజ్‌ ఉంది. హిందీలో కథానాయికగా మంచి ఫామ్‌లో ఉంది ఈ బ్యూటీ. మంచి మంచి సినిమాలు చేయడంతో పాటు పెళ్లీడులో ఉండే అమ్మాయిలు కలలు కనేట్లు తన పెళ్లి గురించి కూడా జాన్వీకి కొన్ని కలలు ఉన్నాయి. ఇటీవల ఓ ఇంగ్లిష్‌ మ్యాగజీన్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పెళ్లి కబుర్లను ఈ విధంగా పంచుకున్నారు జాన్వీ కపూర్‌.

బ్యాచిలరెట్‌ పార్టీ ఎక్కడ చేసుకుంటారు?
జాన్వీ: దక్షిణ ఇటలీలోని కాప్రీలో పడవలో చేసుకుంటాను.

మరి.. సంగీత్, మెహందీ వేడుకలు?
రెండు వేడుకలూ మైలాపూర్‌ (తమిళనాడులోని శ్రీదేవి ఇల్లు)లో మా ఇంట్లో జరుపుతాం.

మరి.. పెళ్లి?
తిరుపతిలో.

పెళ్లికి ధరించే బట్టల గురించి? ఎలాంటి కలర్స్‌ వాడతారు?
సంప్రదాయబద్ధంగా ప్లాన్‌ చేస్తాను. పెళ్లికి కాంచీపురం చీర... మెహందీ, సంగీత్‌లకి ఎల్లో, పింక్, గోల్డ్‌ కలర్‌... వీటితో నా అవుట్‌ఫిట్స్‌ ఉంటాయి.

నగలు?
డైమండ్‌తో చేసినవి.

పెళ్లి వేడుకలు ఎన్ని రోజులు జరుపుకుంటారు?
రెండు రోజులు. అంతే.

రిసెప్షన్‌ ఎక్కడ?
రిసెప్షనా? అవసరమా?

పెళ్లిలో మీ రియాక్షన్స్‌ ఎలా ఉంటాయి?
ఎగరడం, నవ్వడం, ఏడవడం, తినడం... ఇలా.


పెళ్లి మండపం అలంకరణ ఎలా ఉండాలనుకుంటున్నారు?
డెకరేషన్‌ గురించి నాకు పెద్దగా ఐడియా లేదు. అయితే ట్రెడిషనల్‌గా ఉండాలి. పెళ్లి స్టేజీని మల్లెపువ్వులు, కొవ్వొత్తులతో అలంకరిస్తే బాగుంటుంది.

తోడు పెళ్లికూతురిగా ఎవర్ని అనుకుంటున్నారు?
నా చెల్లెలు ఖుషీ, అన్షులా (జాన్వీ తండ్రి బోనీ మొదటి భార్య కుమార్తె), స్నేహితురాలు తనీషా సంతోషి. పెళ్లిలో ఒకవేళ మా నాన్న ఎమోషనల్‌ అయితే అప్పుడు ఆయన్ను ఎలా సముదాయించాలో మా అన్షులాకు తెలుసు.

ఎలాంటి వ్యక్తి భర్తగా రావాలనుకుంటున్నారు? ఎవరైనా ఉన్నారా?
కచ్చితంగా తెలివైనవాడు అయ్యుండాలి. నేనింకా ఎవర్నీ కలవలేదు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement