పాత్ర ఇస్తానని ఆయన ప్రామిస్‌ చేశారు: అవినాష్‌

Avinash Said Director Anil Ravipudi Promises to Give A Role In His Cinema - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఇటీవల ముగిసిన ప్రముఖ రియాలిటీ షో బిగ్‌బాస్‌ నాల్గో సీజన్‌లో జబర్ధస్త్‌ ముక్కు అవినాష్‌ వైల్డ్‌ కార్డ్‌ ఎంట్రీ ఇచ్చి చప్పగా సాగుతున్న బిగ్‌బాస్‌ హౌజ్‌ను తన కామెడితో ఆసక్తికరంగా మార్చాడు. ‌అయితే అతడు బిగ్‌బాస్‌ హౌజ్‌లో అడుగుపెట్టేందుకు జబర్ధస్త్‌ కాంట్రాక్ట్‌ ఒప్పందాన్ని బ్రేక్‌ చేసి పెద్ద రిస్క్‌ చేసిన సంగతి తెలిసిందే. మధ్యలో జబర్ధస్త్‌ను వదిలి వెళుతున్నందుకు గాను నిర్మాతలకు అవినాష్‌ 10 లక్షల రూపాయల జరిమాన కూడా చెల్లించాడు. అయితే బిగ్‌బాస్‌ ద్వారా అవినాష్‌ బాగానే లాభపడినట్లు తెలుస్తోంది. బిగ్‌బాస్‌తో మరింత ఫేంను సంపాదించుకున్న అవినాష్‌కు.. డబ్బులు కూడా భారీ మొత్తంలో అందినట్లు సమాచారం. అయితే ఇటీవల బిగ్‌బాస్‌ ముగియడంతో కంటెస్టెంట్స్‌ అంతా టీవీ, న్యూస్‌ చానళ్లకు ఇంటర్వ్యూలు ఇస్తూ బిబీ బిజీగా ఉన్నారు. (చదవండి: బిగ్‌బాస్‌: అవినాష్‌కు నాగ్‌ ఊహించని గిఫ్ట్‌)

అదే విధంగా అవినాష్‌ కూడా ఇంటర్వ్యూలు ఇస్తూ బిజీగా  అయిపోయాడు. ఈ క్రమంలో ఇటీవల ఓ ఇంటర్య్వూలో అవినాష్‌ మాట్లాడుతూ.. తన సహా కంటెస్టెంట్‌ అరియాన గ్లోరితో వివాహం అంటూ వస్తున్న పుకార్లను ఖండించాడు. అనంతరం ప్రముఖ దర్శకుడు అనిల్‌ రావిపూడి తన తదుపరి సినిమాల్లో మంచి పాత్ర ఇస్తానని తనకు హామీ ఇచ్చినట్లు వెల్లడించాడు. అయితే గత ఆదివారం జరిగిన ఫైనల్‌ ఎపిసోడ్లో దర్శకుడు అనిల్‌ రావిపూడి ముఖ్య అతిథిగా బిగ్‌బాస్‌లో హౌజ్‌లో అడుగుపెట్టి టాప్‌ 5లోని ఒకరిని ఎలిమినేట్‌ చేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా తనను కలిసిన దర్శకుడు అనిల్‌‌ తన తదుపరి సినిమాల్లో నటించే అవకాశం ఇస్తానని, ఒకసారి కలవమని కూడా చెప్పినట్లు అవినాష్‌ చెప్పుకొచ్చాడు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top