101 జిల్లాల అందగాడిని నేనే అంటున్న 'అవసరాల'

Avasarala Srinivas Upcoming Movie 101 Jillala Andagadu All Set To Release - Sakshi

న‌టుడిగా, ద‌ర్శ‌కుడి గుర్తింపు పొందిన అవసరాల శ్రీనివాస్‌ ఇప్పుడు కథానాయకుడిగానూ అలరించేందుకు రెడీ అవుతున్నారు. అవసరాల శ్రీనివాస్‌ టైటిల్‌ పాత్రలో నటించిన చిత్రం ‘101 జిల్లాల అందగాడు’ రిలీజ్‌కు రెడీ అయ్యింది. ఆగ‌స్ట్ 27న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రంతో రాచకొండ విద్యాసాగర్‌ దర్శకుడిగా  పరిచయం కానున్నారు.

 శ్రీవెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్‌, ఎస్‌వీసీ-ఎఫ్ఈఈ బ్యాన‌ర్స్‌పై  ‘దిల్‌’ రాజు, డైరెక్టర్‌ క్రిష్‌ సమర్పణలో శిరీష్, రాజీవ్‌ రెడ్డి, సాయిబాబు జాగర్లమూడి సంయుక్తంగా నిర్మించారు. బట్టతల ఉండే యువకుడి పాత్రలో అవసరాల నటించగా, ఆయన ప్రేయసి పాత్రలో రుహానీ శర్మ నటించారు. శక్తికాంత్‌ కార్తీక్‌ ఈ చిత్రానికి సంగీతం అందించారు. 

 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top