దీపికా ప్రెగ్నెన్సీ.. రాకా యాక్షన్‌ సీన్స్‌పై క్లారిటీ..! | Atlee to use body double for Deepika in Raaka after pregnancy | Sakshi
Sakshi News home page

Raaka Movie: దీపికా ప్రెగ్నెన్సీ.. డూప్‌ విషయంలో మేకర్స్ క్లారిటీ..!

Apr 28 2026 6:38 PM | Updated on Apr 28 2026 6:53 PM

Atlee to use body double for Deepika in Raaka after pregnancy

అల్లు అర్జున్- ‍అట్లీ కాంబోలో తొలిసారి వస్తోన్న బిగ్ ప్రాజెక్ట్ రాకా. ఈ ఏడాది బన్నీ బర్త్‌ డే సందర్భంగా టైటిల్‌తో పాటు ఫస్ట్ లుక్‌ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఇందులో తోడేలును తలపించేలా బన్నీ లుక్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది. ఈ పోస్టర్ చూస్తుంటే అల్లు అర్జున్‌ ద్విపాత్రాభినయం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ లుక్ చూస్తే బన్నీ నెగెటివ్ రోల్‌ చేయనున్నారని అర్థమవుతోంది. ఈ భారీ యాక్షన్‌ మూవీలో బాలీవుడ్ భామ దీపికా పదుకొణె హీరోయిన్‌గా కనిపించనుంది.

దీపికా పదుకొణె ఇటీవలే రెండోసారి ప్రెగ్నెన్సీ ప్రకటించింది. ఇప్పటికీ ఆమెకు ఓ కూతురు ఉండగా.. మరోసారి గుడ్ న్యూస్ చెప్పింది. దీంతో రాకా షూటింగ్‌ గురించి అభిమానుల్లో ఆందోళన మొదలైంది. ఈ నేపథ్యంలోనే రాకా సంబంధించి ఓ టాక్ నెట్టింట వైరల్‌గా మారింది. దీపికా పాత్ర కోసం రాకా మార్పులు చేస్తారా? అన్న సందేహం ఫ్యాన్స్‌లో ఆసక్తి పెంచుతోంది. ఆమె ప్రెగ్నెంట్ కావడంతో యాక్షన్‌ సీన్స్‌ను డూప్‌తో చేయిస్తారని బాలీవుడ్‌లో చర్చ నడుస్తోంది.  

అయితే తాజా సమాచారం ప్రకారం రాకా స్క్రిప్ట్‌లో ఎలాంటి మార్పు చేయడం లేదని తెలుస్తోంది. దీపికా పదుకొణెకు అద్భుతమైన ఎంట్రీతో పాటు.. అల్లు అర్జున్‌తో ఒక బిగ్ యాక్షన్ సన్నివేశం కూడా ఉందని టాక్. అయితే ఈ యాక్షన్‌ సీన్స్‌లో మాత్రం దీపికా డూప్‌తో చేయించనున్నారు. మిగిలిన సన్నివేశాల్లో దీపికానే షూటింగ్‌లో కొనసాగించనున్నారు. ఆమె ప్రెగ్నెంట్ కారణంగా రాకా కథలో ఎలాంటి మార్పు ఉండదని మేకర్స్ స్పష్టం చేశారు. దీంతో అభిమానుల అనుమానాలకు ఇక తెరపడినట్లే. కాగా.. ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement