
అర్జున్ చక్రవర్తి చిత్రం కెమెరామెన్ జగదీష్ చీకటి పేరు ఎక్కువగా వినిపిస్తోంది. విజువల్ ట్రీట్‌గా మూవీని తెరకెక్కించిన జగదీష్ పనితనం గురించే అందరూ మాట్లాడుకుంటున్నారు. ఈ చిత్రానికి గానూ ఎన్నో అంతర్జాతీయ వేడుకల్లో బెస్ట్ సినిమాటోగ్రఫర్‌గా జగదీష్ చీకటి అవార్డుల్ని అందుకున్నారు. ప్రస్తుతం ఈ సినిమా విజయవంతంగా దూసుకుపోతోండటంతో కెమెరామెన్ జగదీష్ పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.
జేఎన్టీయూ ఫైన్ ఆర్ట్స్ కాలేజీలో చదువుతున్న రోజుల్లోనే ఫోటోగ్రఫీలో ఎన్నో అవార్డులు సాధించినట్లు జగదీశ్ తెలిపారు. వందకు పైగా షార్ట్ ఫిల్మ్స్, డాక్యుమెంటరీ ఫిల్మ్స్, కమర్షియల్ యాడ్స్ ఎన్నో ప్రాజెక్టులకు పనిచేశానని వెల్లడించారు. అలా చేస్తున్న సమయంలోనే ‘జత కలిసే’ మూవీకి అవకాశం వచ్చిందన్నారు. ఆ సమయంలోనే ‘నాయకి’, ఆర్జీవీ ప్రొడక్షన్స్ నుంచి ‘భైరవ గీత’ లాంటి చాలా ప్రాజెక్ట్‌లు వచ్చాయని తెలిపారు.
మన ఇండియాలో గొప్ప టెక్నీషియన్లు ఉన్నారని.. హాలీవుడ్ స్థాయికి ధీటుగా మనం తీస్తున్నామని జగదీశ్ అన్నారు. ‘అర్జున్ చక్రవర్తి మూవీకి ఆ స్థాయి లుక్ వచ్చేందుకు నేచురల్ లైటింగ్‌లోనే షూటింగ్ చేశామని తెలిపారు. సౌండ్ అయినా, సినిమాటోగ్రఫీ అయినా కూడా దర్శకుడి విజన్‌కు తగ్గట్టుగా ఉండాలని.. అప్పుడే రిజల్ట్ బాగా వస్తుందని వెల్లడించారు. దర్శకుడి విజన్‌ను అర్థం చేసుకోవాలి.. అలా నాకు దర్శకుడితో సింక్ కానప్పుడు ఓ ప్రాజెక్ట్ నుంచి బయటకు వచ్చానన్నారు.
కాశ్మీర్‌లో మైనస్ 8 డిగ్రీల వద్ద షూటింగ్ చేశామని జగదీశ్ తెలిపారు. మేం అనుకున్న దానికింటే విజువల్స్ అద్భుతంగా వచ్చాయని.. ఆ మంచు ప్రాంతంలో షూటింగ్ చేయడం ఎంతో కష్టంగా అనిపించిందన్నారు. క్లైమాక్స్ ఎపిసోడ్‌కి చాలా కష్టపడాల్సి వచ్చిందన్నారు. మా కష్టానికి గుర్తింపుగా అర్జున చక్రవర్తికి అంతర్జాతీయ స్థాయిలో నాకు నాలుగు అవార్డులు వచ్చాయని తెలిపారు. కోలీవుడ్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఇండియా, కేరవ్యాన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్, మోకో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్, ది బుద్దా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డులు వచ్చాయన్నారు.