‘అరేయ్ ఆపండ్రా’ రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌ | Arey Apandra Movie Release Date Out | Sakshi
Sakshi News home page

‘అరేయ్ ఆపండ్రా’ రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌

May 1 2026 5:22 PM | Updated on May 1 2026 6:03 PM

Arey Apandra Movie Release Date Out

ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని పుట్టినరోజును పురస్కరించుకుని, మే 15న "అరేయ్ ఆపండ్రా" చిత్రం గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల కానుంది. క్రియేటివ్ థింక్స్ గ్యాంగ్ బ్యానర్‌పై బేబీ హరిణి సమర్పణలో, తల్లాడ సాయి కృష్ణ దర్శకత్వంలో అశోక్ నిమ్మల ఈ కామెడీ సస్పెన్స్ చిత్రాన్ని నిర్మించారు.ఈ సందర్భంగా చిత్ర యూనిట్ మీడియాతో ముచ్చటించి సినిమా విశేషాలను పంచుకుంది.

నిర్మాత అశోక్ నిమ్మల మాట్లాడుతూ, "ఈ వేసవిలో ప్రేక్షకులకు కడుపుబ్బ నవ్వించే ఒక అద్భుతమైన చిత్రాన్ని అందించబోతున్నాం. అనుకున్న బడ్జెట్‌లో మా దర్శకుడు సినిమాను చాలా రిచ్‌గా తెరకెక్కించారు. సుదర్శన్, భద్రం, తల్లాడ సాయికృష్ణల నటన సినిమాకు ప్రధాన ఆకర్షణ" అని తెలిపారు.

సహ నిర్మాత వెంకట్ దుగ్గిరెడ్డి మాట్లాడుతూ.. ఈ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాలతో పాటు అమెరికాలో కూడా భారీగా విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. మరో సహ నిర్మాత అంజాద్ మాట్లాడుతూ షూటింగ్ ఖమ్మం, హైదరాబాద్ పరిసరాల్లో జరిగిందని, అవుట్‌పుట్ అద్భుతంగా వచ్చిందని ధీమా వ్యక్తం చేశారు.
న్యాచురల్ కామెడీతో పాటు మంచి సందేశం

దర్శక-నటుడు తల్లాడ సాయి కృష్ణ మాట్లాడుతూ.. "నేటి సామాజిక పరిస్థితులను సహజమైన కామెడీతో జోడించి, ఒక మంచి సందేశంతో ఈ సినిమాను రూపొందించాం. మా లాంటి యంగ్ ఫిల్మ్ మేకర్స్‌కి రామ్ అన్న పెద్ద ఇన్స్పిరేషన్. ఆయన పుట్టినరోజున సినిమాను విడుదల చేయడం సంతోషంగా ఉంది. అలాగే 'ఒంగోలు గిత్త'లో రామ్ అన్నతో నటించిన కిషోర్ దాస్ గారు మా సినిమాలో ఉండటం మాకు పెద్ద ప్లస్" అని అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement