CM YS Jagan Inquires About Kaikala Satyanarayana Health Condition: నటుడు కైకాల సత్యనారాయణ అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన సంగతి తెలిసిందే. హైదరాబాద్‌లోని అపోలో ఆసుపత్రిలో వెంటిలేటర్‌పై వైద్యులు ఆయనకు చికిత్స అందిస్తున్నారు. తాజాగా కైకాల ఆరోగ్యంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఆరా తీశారు. ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి కైకాల కుటుంబసభ్యులను అడిగి తెలుసుకున్నారు.
కాగా గత కొన్నిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న కైకాల సత్యనారాయణ ఇటీవల స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. కొన్ని రోజుల క్రితం ఇంట్లో ఆయన జారిపడటంతో నొప్పులు ఎక్కువగా ఉండటంతో అపోలో ఆసుపత్రిలో చేర్పించారు. అయితే బీపీ లెవల్స్ చాలా తక్కువగా ఉండటంతో వాసో ప్రెజర్ సాయంతో చికిత్స అందిస్తున్నామని వైద్యులు పేర్కొన్నారు. కైకాలను ఎప్పటికప్పుడు వైద్యుల బృందం పరిశీలిస్తోందని తెలిపారు.

 
                                                    
                                                    
                                                    
                                                    
                                                    
                        
                        
                        
                        
                        
