అయామ్‌ సో లక్కీ: ఏంజెలీనా జోలీ

Angelina Jolie Says Her Kids Are Helping Each Other - Sakshi

ఏంజెలీనా జోలీకి పిల్లలంటే ప్రాణం. భర్త బ్రాడ్‌ పిట్‌ పిల్లల్ని చిన్న మాట అన్నాడని అతడికి విడాకులు ఇచ్చేశారు. జోలీకి ముగ్గురు కొడుకులు, ముగ్గురు కూతుళ్లు. ఈ ఆరుగురిలో ముగ్గురు కడుపున పుట్టిన వారు. ముగ్గురు కడుపుకు కట్టుకున్నవారు (అడాప్టెడ్‌). మాడెక్స్‌–19 కొ, పాక్స్‌–16 కొ, జహారా–15 కూ.. దత్తత తెచ్చుకున్నవాళ్లు. షిలా–14 కూ, నాక్స్‌–12 కొ, వివియన్‌–12 కూ.. జోలీకి, బ్రాడ్‌ కీ పుట్టిన వాళ్లు. ఈ చివరి ఇద్దరు కవలలు. ఈ తల్లీబిడ్డలు ఇప్పుడు లాస్‌ ఏంజెలిస్‌లోని తమ సొంత లాస్‌ ఫెలిజ్‌ భవంతిలో క్వారెంటైన్‌లో ఉంటున్నారు. మాడెక్స్‌ ఐదు నెలల క్రితమే దక్షిణ కొరియా నుంచి అమెరికా వచ్చేశాడు. అక్కడి యాన్సీ యూనివర్సిటీలో అతడు బయోకెమిస్ట్రీ స్టూడెంట్‌. ఇప్పుడిక ఆన్‌లైన్‌ లోనే చదువు కొనసాగుతోంది. (ఏంజెలినా విడాకుల కేసు: ఆ లాయర్‌ను తొలగించండి)

మిగతా ఐదుగురివీ యూఎస్‌ చదువులే కనుక అంతా ఒకదేశంలో ఒకేచోట ఉన్నారు. ‘అయామ్‌ సో లక్కీ..’ అంటారు జోలీ తన పిల్ల సైన్యాన్ని చూసుకుని. తల్లికి అస్సలు పని పెట్టరట. చిన్న పిల్లల్ని పెద్దపిల్లలు కాసుకుని ఉంటారట. ఆగస్టు 21న జోలీ కొత్త సినిమా ‘ది వన్‌ అండ్‌ ఓన్లీ ఇవాన్‌’ విడుదలైంది. ఆ ప్రమోషన్‌ ఈవెంట్‌లో ఆమె ఇంటి విశేషాలు బయటికి వచ్చాయి. ఇల్లంటే జోలీకి పిల్లలే. 45 ఏళ్ల జోలీ.. పెద్ద కొడుకు మాడెక్స్‌ ని కంబోడియా నుంచి, రెండో కొడుకు పాక్స్‌ని వియత్నాం నుంచి, పెద్ద కూతురు జహారాను ఇథియోపియా నుంచి దత్తతు తెచ్చుకున్నారు. ‘ది వన్‌ అండ్‌ ఓన్లీ ఇవాన్‌’ కూడా పిల్లల సినిమానే. యానిమేటెడ్‌. అందులో ఒక పాత్రకు వాయిస్‌ ఇచ్చారు ఏంజెలీనా జోలీ. చదవండి: (అవుట్‌సైడర్స్‌కి ప్లస్‌ అదే!)

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top