కొరియోగ్రాఫర్‌ చైతన్య సూసైడ్‌పై స్పందించిన యాంకర్‌ రష్మీ | Anchor Rashmi Gautham Reacts To Dhee Choreoghrapher Chaitanya Death | Sakshi
Sakshi News home page

Rashmi Gautham : కొరియోగ్రాఫర్‌ చైతన్య సూసైడ్‌పై స్పందించిన యాంకర్‌ రష్మీ

May 1 2023 4:39 PM | Updated on May 1 2023 4:50 PM

Anchor Rashmi Gautham Reacts To Dhee Choreoghrapher Chaitanya Death - Sakshi

ఢీ షో కొరియోగ్రాఫర్‌ చైతన్య మాస్టర్‌ అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే!అప్పులబాధ తట్టుకోలేకే బలవన్మరణానికి పాల్పడుతున్నట్లు సెల్ఫీ వీడియోలో పేర్కొన్నారు. ఢీ షో వల్ల మంచి పేరు వచ్చింది, కానీ తగినంత సంపాదన రాలేదని తన ఆవేదనను వ్యక్తం చేశాడు.

చదవండి: ఢీ డ్యాన్స్ షో కొరియోగ్రాఫర్ చైతన్య ఆత్మహత్య

ఆర్థిక ఇబ్బందులతో చనిపోతున్నట్లు స్వయంగా వెల్లడించాడు. ఇక చైతన్య మాస్టర్ మరణంతో అంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఈ క్రమంలో అతడితో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ ఎమోషనల్‌ అవుతున్నారు.

తాజాగా తాజాగా ఆయన మరణంపై ప్రముఖ యాంకర్‌ రష్మీ గౌతమ్‌ స్పందించింది. నీ సమస్యకు ఇది పరిష్కారం కాదు చైతన్య. నీ కుటుంబానికి ఆ భగవంతుడు మనోధైర్యాన్ని ప్రసాదించాలని కోరుకుంటున్నా. నీ ఆత్మకు శాంతి చేకూరాలి అంటూ ఇన్‌స్టా స్టోరీలో  పేర్కొంది.  చదవండి: వెక్కి వెక్కి ఏడ్చా.. చైతన్య మాస్టర్‌ మరణంపై శ్రద్ధాదాస్‌ ఎమోషనల్‌ పోస్ట్‌

Advertisement
 
Advertisement
Advertisement