అనసూయ ట్వీట్‌‌.. మెగా ఫ్యామిలీలో కలకలం! | Anasuya Bharadwaj Says She Have Coronavirus Symptoms | Sakshi
Sakshi News home page

కరోనా లక్షణాలు కనిపించాయి.. జాగ్రత్త : అనసూయ

Jan 10 2021 3:55 PM | Updated on Jan 10 2021 6:20 PM

Anasuya Bharadwaj Says She Have Coronavirus Symptoms - Sakshi

టాలీవుడ్‌ సెలెబ్రిటీలను కరోనా మహమ్మారి వెంటాడుతోంది. తగు జాగ్రత్తలు తీసుకుంటూ షూటింగ్‌లో పాల్గొన్నప్పటికీ.. వారు వైరస్‌ బారిన పడుతున్నారు. ఇటీవల కాలంలో రామ్‌చరణ్‌, వరుణ్‌తేజ్‌, తమన్నా, రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ వంటి స్టార్స్‌ కోవిడ్‌ బారిన పడిన సంగతి తెలిసిందే. తాజాగా బుల్లితెర యాంకర్‌ అనసూయ భరద్వాజ్‌కు కూడా కరోనా సోకినట్లు ఉంది. ఈ విషయాన్ని ఆమె తన ట్విట్టర్‌ ద్వారా తెలియజేశారు.

ఓ కార్య‌క్ర‌మం నిమిత్తం ఈ రోజు ఉద‌యం క‌ర్నూలుకు వెళ్దామ‌ని ఉద‌యాన్నే లేచాను. నాలో క‌రోనా ల‌క్ష‌ణాలు క‌నిపించాయి. దీంతో నా ప్ర‌యాణాన్ని వాయిదా వేసుకున్నాను. వీలైనంత త్వ‌ర‌గా వైద్య‌ప‌రీక్ష‌లు చేయించుకుంటాను. నా టెస్ట్‌ రిజల్ట్స్‌ గురించి తెలియజేస్తాను.  ఇటీవ‌ల న‌న్ను క‌లిసిన వాళ్లు కూడా ఓసారి టెస్ట్ చేయించుకోండి. అంద‌రూ జాగ్ర‌త్త’అని అన‌సూయ ట్వీట్ చేశారు.  

బుల్లితెర యాంక‌ర్‌గా ప్ర‌స్థానాన్ని ప్రారంభించిన అన‌సూయ‌, కొంత కాలంగా వెండితెర‌పై కూడా స‌త్తా చాటుతున్నారు. రంగ‌స్థలం సినిమాలో రంగ‌మ్మ‌త్త పాత్ర‌లో ఇర‌గ‌దీసింద‌నే పేరు సొంతం చేసుకున్నారామె. ప్రస్తుతం ఆమె 'థాంక్యూ బ్రదర్' సినిమాలో నటిస్తోంది. జ‌స్ట్ ఆర్డిన‌రీ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ ప‌తాకంపై ర‌మేశ్ రాప‌ర్తి దర్శకత్వంలో 'థాంక్యూ బ్రదర్' రూపొందుతోంది. శ‌ర‌త్ చంద్రారెడ్డితో కలిసి తారక్‌నాథ్ బొమ్మిరెడ్డి నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో అన‌సూయ గర్భిణిగా ఛాలెంజింగ్ రోల్ చేస్తోంది. విరాజ్‌ అశ్విన్‌ ముఖ్య పాత్ర పోషిస్తున్నాడు. మరోవైపు మెగా డాటర్‌ నిహారికతో కలిసి ఓ వెబ్ సిరీస్ కూడా చేయబోతోంది అనసూయ. రీసెంట్‌గా ఈ వెబ్ సిరీస్ లాంఛ‌నంగా ప్రారంభించారు. ఆ సమయంలో నిహారిక అనసూయ మీట్ అయ్యారు. మరి అనసూయ అనుమానం నిజమై.. పాజిటివ్‌ వస్తే.. నిహారిక కూడా కరోనా నిర్థారణ పరీక్షలు చేయించుకోక తప్పదు.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement