పుకార్లకు చెక్.. 'పుష్ప 2' తర్వాత బన్నీ సినిమా ఫిక్స్ | Allu Arjun Third Movie With Trivikram Announcement On His Birthday, Poster Goes Viral - Sakshi
Sakshi News home page

Allu Arjun - Trivikram Movie Update: ఆ దర్శకుడితో బన్నీ నాలుగోసారి.. హిట్ కొడతారా?

Apr 8 2024 2:15 PM | Updated on Apr 8 2024 5:22 PM

Allu Arjun Third Movie With Trivikram Announcement On His Birthday - Sakshi

అల్లు అర్జున్ నెక్ట్స్ సినిమా ఫిక్సయిపోయిందా? అంటే అవుననే తెలుస్తోంది. ప్రస్తుతం 'పుష్ప 2'తో బన్నీ ఫుల్ బిజీగా ఉన్నాడు. పుట్టినరోజు సందర్భంగా టీజర్ రిలీజ్ చేశారు. మంచి హై ఇచ్చే విజువల్స్.. అభిమానులకు కిక్ ఇస్తున్నాయి. ఇప్పుడు బన్నీ నుంచి మరో అప్డేట్ వచ్చేసింది.

అల్లు అర్జున్ 'పుష్ప' మూవీని 2021 చివర్లో కేవలం తెలుగు వరకే రిలీజ్ ప్లాన్ చేసుకున్నారు. కానీ పెద్దగా ప్రమోషన్ లేకుండానే పాన్ ఇండియా రిలీజ్ చేశారు. అయితే తెలుగులో మిశ్రమ స్పందన వచ్చింది. కానీ ఉత్తరాదిలో మాత్రం ప్రేక్షకులు 'పుష్ప' దెబ్బకు మెంటలెక్కిపోయారు. ఫలితంగా బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకుంది.

(ఇదీ చదవండి: ఎన్నికల్లో తొలిసారి పోటీ.. కోట్లు విలువైన కారు కొన్న హీరోయిన్)

దీంతో 'పుష్ప 2' కాస్త లేట్ అయింది. ఈ ఏడాది ఆగస్టు 15న థియేటర్లలోకి తీసుకురాబోతున్నారు. అయితే దీని తర్వాత బన్నీ చేయబోయే సినిమా ఏంటనేది ఇంకా సస్పెన్స్ గానే ఉండిపోయింది. త్రివిక్రమ్, అట్లీ, బోయపాటి శ్రీను.. ఇలా చాలా పేర్లు వినిపించాయి.

కానీ ఇప్పుడు 'పుష్ప 2' తర్వాత త్రివిక్రమ్ దర్శకత్వంలోనే సినిమా చేస్తాడనిపిస్తోంది. బన్నీ పుట్టినరోజు సందర్భంగా విషెస్ చెబుతూ హారిక అండ్ హాసిని నిర్మాణ సంస్థ పోస్టర్ రిలీజ్ చేసింది. దీంతో ఈ మూవీ క్యాన్సిల్ అయిందనే పుకార్లకు చెక్ పడినట్లయింది. ఈ సంక్రాంతికి 'గుంటూరు కారం'తో వచ్చిన త్రివిక్రమ్ ఘోరమైన విమర్శలు ఎదుర్కొన్నాడు. మరి అల్లు అర్జున్ తో తీయబోయే సినిమా ఏం చేస్తాడోనని ఫ్యాన్స్ మాట్లాడుకుంటున్నారు.

(ఇదీ చదవండి: 3 వారాల్లోనే ఓటీటీలోకి వచ్చేస్తున్న తెలుగు కామెడీ సినిమా)

Advertisement
 
Advertisement
Advertisement