'నా జీవితంలో ఇదొక అద్భుతమైన క్షణం'.. అల్లు అర్జున్ ట్వీట్ వైరల్! | Allu Arjun Shares A Cryptic Post Of His Movie Desamuduru Released On This Date | Sakshi
Sakshi News home page

Allu Arjun: పూరి జగన్నాధ్‌కు ప్రత్యేక ధన్యవాదాలు.. అల్లు అర్జున్ ట్వీట్ వైరల్!

Published Fri, Jan 12 2024 4:54 PM | Last Updated on Fri, Jan 12 2024 5:12 PM

Allu Arjun Shares A Criptic Post Of His Movie Desamuduru Release On This Date - Sakshi

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గురించి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. గతేడాది ఉత్తమ జాతీయ నటుడిగా అవార్డ్ కూడా అందుకున్నారు. గంగోత్రి సినిమాతో కెరీర్‌ ప్రారంభించిన అల్లు అర్జున్ టాలీవుడ్‌లో స్టార్‌ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నారు.  ఆ తర్వాత బన్నీ మూవీ సూపర్‌ హిట్‌ కావడంతో ప్రేక్షకుల గుండెల్లో బన్నీగా స్థిరపడిపోయారు. అనంతరం 2007లో అల్లు అర్జున్‌ దేశముదురు అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. ఈ సినిమాలో హన్సిక మోత్వానీ హీరోయిన్‌గా నటించారు. ఈ చిత్రం రిలీజై సరిగ్గా నేటికి 17 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా అల్లు అర్జున్ ట్వీట్ చేశారు. దేశముదురు డైరెక్టర్‌ పూరి జగన్నాధ్, నిర్మాత డీవీవీ దానయ్యకు అభినందనలు  తెలిపారు.

అల్లు అర్జున్ తన ట్వీట్‌లో రాస్తూ.. 'దేశముదురు చిత్రం ఈ రోజుకు 17 ఏళ్లు పూర్తి చేసుకుంది. నా జీవితంలో ఇదొక అద్భుతమైన క్షణం. డైరెక్టర్ పూరి జగన్నాధ్‌, నిర్మాత డీవీవీ దానయ్య, చిత్రబృందానికి నా ప్రత్యేక ధన్యవాదాలు. నా కెరీర్‌లో చిరస్మరణీయమైన విజయం అందించిన నా అభిమానులకు, ప్రేక్షకులకు ఎప్పటికీ కృతజ్ఞతలు' అంటూ పోస్ట్ చేశారు. ఇది చూసిన అభిమానులు బన్నీకి సైతం అభినందనలు చెబుతున్నారు. ఈ మేరకు ట్విటర్‌ వేదికగా పోస్టులు పెడుతున్నారు. కాగా.. అల్లు  అర్జున్‌ ప్రస్తుతం సుకుమార్ డైరెక్షన్‌లో తెరకెక్కిస్తోన్న పుష్ప-2 చిత్రంలో నటిస్తున్నారు. ఈ మూవీని ఆగస్టు 15న విడుదల చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. ఐకాన్‌ స్టార్‌కు జోడీగా శ్రీవల్లి రష్మిక మందన్నా నటిస్తోంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
 
Advertisement
 
Advertisement