రిషబ్ శెట్టి దర్శకత్వం వహించి, నటించిన కాంతార: చాప్టర్ 1(Kantara: Chapter 1) సినిమా ఇండియన్ బాక్సాఫీస్‌ని షేక్ చేస్తుంది. దసరా కానుకగా అక్టోబర్ 2న విడుదలైన ఈ చిత్రం కలెక్షన్స్ పరంగా ఇప్పటికే పలు రికార్డులను బద్దలు కొట్టింది. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటి వరకు 818 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. తెలుగులోనూ ఇప్పటికే రూ. 110 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. ఇక ఈ చిత్రంపై పలువురు సినీ ప్రముఖులు స్పందించారు. సినిమా అదిరిపోయిందని సోషల్ మీడియా వేదికగా రిషబ్పై ప్రశంసలు కురిపించారు. తాజాగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) కూడా కాంతార: చాప్టర్పై ప్రశంసలు జల్లు కురిపించారు. ఈ సినిమా తనను ఎంతగానో ఆకట్టుకుందని ట్వీట్ చేశాడు
రిషబ్..వన్‌మ్యాన్ షో
‘నిన్న రాత్రి కాంతార చాప్టర్ 1 సినిమా చూశాను. వావ్..ఎంత అద్భుతమైన సినిమా. ఈ మూవీ చూస్తూ నేను ట్రాన్స్లోకి వెళ్లిపోయా. రచయితగా, డైరెక్టర్గా, యాక్టర్గా రిషబ్ శెట్టి వన్‌మ్యాన్ షో అని చెప్పాలి. ప్రతి క్రాప్ట్లో ఆయన రాణించారు. రుక్మిణి, జయరామ్, గుల్షన్ దేవయ్యతో పాటు మిగతా నటీనటులంతా చక్కగా నటించారు. టెక్నికల్ టీమ్ పనితీరు అద్భుతంగా ఉంది. ముఖ్యంగా అజనీష్ సంగీతం, అరవింద్ కశ్యప్ సినిమాటోగ్రఫీ, ధరణి ఆర్ట్ డైరెక్టన్, అరుణ్ రాజ్ స్టంట్స్ చాలా బాగున్నాయి. నిర్మాత విజయ్ కిరంగదూర్, హోంబులే బ్యానర్కి శుభాకాంక్షలు’ అని బన్నీ తన ఎక్స్లో రాసుకొచ్చాడు.
లేట్ ఎందుకు?
కాంతార సినిమా అక్టోబర్ 2న విడుదలైన సంగతి తెలిసిందే. రిలీజ్ అయిన వారం రోజులలోపే సినీ ప్రముఖులంతా ఈ సినిమా చూసి తన అభిప్రాయాన్ని సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. కానీ అల్లు అర్జున్ మాత్రం చాలా లేట్గా స్పందించాడు. సూపర్ హిట్ టాక్ వచ్చిన ఓ సినిమాను ఇంత ఆలస్యంగా చూడడానికి గల కారణం ఏంటని నెటిజన్స్ ఆరా తీస్తున్నారు. అసలు విషయం ఏంటి అంటే..బన్నీ ప్రస్తుతం చాలా బిజీగా ఉన్నాడు. అట్లీ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ కోసం ముంబైలో ఓ భారీ సెట్ కూడా వేశారు. అందులోనూ షూటింగ్ జరుగుతుంది. షూటింగ్తో బిజీగా ఉండడం వల్లే అల్లు అర్జున్ కాంతార సినిమాను చూడలేకపోయాడు అట. ఇప్పుడు కాస్త ఫ్రీ టైం దొరకడంతో సినిమా చూసి..వెంటనే సోషల్ మీడియా ద్వారా తన అభిప్రాయాన్ని వెల్లడించాడు.
Watched #Kantara last night. Wow, what a mind-blowing film. I was in a trance watching it.
Kudos to @shetty_rishab garu for a one-man show as writer, director, and actor. He excelled in every craft.
Aesthetic performances by @rukminitweets garu, #Jayaram garu, @gulshandevaiah… pic.twitter.com/qneOccCjvd— Allu Arjun (@alluarjun) October 24, 2025


