వాళ్లను కాదనుకొని బోయపాటితో సినిమా చేయనున్న బన్నీ!

Allu Arjun Planning To Work His Next Film With Boyapati Srinu  - Sakshi

అల్లు అర్జున్‌ ప్రస్తుతం సుకుమార్‌ దర్శకత్వంలో పుష్ప సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే బన్నీకి కరోనా రావడంతో ఈ షూటింగ్‌కి బ్రేక్‌ పడింది. ఈ సినిమా తర్వాత అల్లు అర్జున్‌ ఏ డైరెక్టర్‌తో మూవీ చేయనున్నాడనే సస్పెన్స్‌కు తెరపడటం లేదు. ఇప్పటికే అల్లు అర్జున్‌ కొరటాల శివ సినిమాకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే కొరటాల మాత్రం ఎన్టీఆర్‌తో సినిమా పూర్తయిన తర్వాతే బన్నీ ప్రాజెక్టును పట్టాలెక్కించాలని అనుకుంటున్నాడట. సో ఈ గ్యాప్‌లో ఓ మూవీ చేయాలని బన్నీ భావిస్తున్నాడట.

ఇందులో భాగంగా పలువురు దర్శకుల పేర్లు తెరపైకి వచ్చాయి. అయితే ముందుగా మురగదాస్‌తో సినిమా చేయాలని భావించినా ప్రస్తుతం ఆ ప్రాజెక్టును పక్కన పెట్టాలనుకుంటున్నాడట. మూవీ మేకింగ్‌లో మురగదాస్‌ ఎక్కువ టైం తీసుకుంటారన్న కారణంతో ఆ గ్యాప్‌లో ఓ సినిమా చేయాలని ఫిక్సయ్యాడట బన్నీ. తాజాగా సరైనోడు సినిమాతో తనకు హిట్‌ ఇచ్చిన బోయపాటితో అల్లుఅర్జున్‌ సినిమా చేయనున్నట్లు తెలుస్తోంది ప్రస్తుతం ఆయన అఖండ మూవీని తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీ కంప్లీట్‌ చేయగానే బన్నీతో సెట్స్‌పైకి వెళ్లనున్నట్లు టాక్‌ వినిపిస్తోంది. ఈ సినిమా తర్వాత మురగదాస్‌తో గజినీ సీక్వెల్‌ చేసే అవకాశం ఉంది. 

చదవండి : నాన్న కోసం దోశ వేసిన అల్లు అర్హ.. వీడియో వైరల్‌
TNR : ఆ కోరిక తీరకుండానే కన్నుమూసిన టీఎన్‌ఆర్‌

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top