
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ను స్టార్ హీరో అల్లు అర్జున్ కలుసుకున్నారు. హైదరాబాద్‌లోని పవన్ ఇంటికి వెళ్లిన బన్ని మార్క్ శంకర్ ఆరోగ్యం గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. కొద్దిరోజుల క్రితం సింగపూర్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో పవన్ కుమారుడు గాయపడిన సంగతి తెలిసిందే. పవన్ కల్యాణ్ కుటుంబ సభ్యులతో దాదాపు 30 నిమిషాల పాటు అల్లు అర్జున్ దంపతులు మాట్లాడినట్లు తెలుస్తోంది. కానీ, అందుకు సంబంధించిన ఫోటోలు వంటివి అధికారికంగా వెలువడలేదు.