నాగార్జున 'శివ' రీ రిలీజ్‌.. బన్నీ పోస్టర్‌ రిలీజ్‌..! | Icon Star Allu Arjun talks about the Impact of SHIVA | Sakshi
Sakshi News home page

Allu Arjun: శివ రీ రిలీజ్‌.. అందరి కళ్లు ఐకాన్ స్టార్‌పైనే..!

Oct 24 2025 6:33 PM | Updated on Oct 24 2025 7:14 PM

Icon Star Allu Arjun talks about the Impact of SHIVA

అక్కినేని నాగార్జున నటించిన  కల్ట్‌ బ్లాక్‌బస్టర్‌  మూవీ 'శివ'. ఈ మూవీ నాగ్ కెరీర్‌లోనే చాలా ప్రత్యేకం. ఈ సినిమా రీ రిలీజ్‌ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాతో రామ్‌గోపాల్‌ వర్మ దర్శకుడిగా పరిచయమయ్యారు. అక్కినేని వెంకట్, యార్లగడ్డ సురేంద్ర నిర్మించిన ఈ సినిమా 1989 అక్టోబర్‌ 5న రిలీజైంది.  ఇళయరాజా సంగీతంలో ఈ సినిమా మ్యూజికల్‌ హిట్‌గానూ నిలిచింది. ఈ సినిమాని శివ(1990) పేరుతోనే హిందీలో రీమేక్‌ చేసిన రామ్‌గోపాల్‌ వర్మ అక్కడ కూడా హిట్‌ అందుకున్నారు.

ఈ సినిమా 4కె వర్షన్‌, డాల్బీ ‍అట్మాస్‌లో ప్రేక్షకులకు సరికొత్త ఎక్స్‌పీరియన్స్ ఇవ్వనుంది. తెలుగులో  మరోసారి వెండితెరపై సందడి చేయనుంది. ఈ మూవీ గురించి ఐకాన్ స్టార్‌ అల్లు అర్జున్‌ ప్రత్యేకంగా మాట్లాడనున్నారు. టాలీవుడ్‌ సినిమా శివ మూవీ తెచ్చిన మార్పు గురించి ప్రస్తావించనున్నారు. ఈ శుక్రవారం ఉదయం 11 గంటల 7  నిమిషాలకు మాట్లాడనున్నట్లు అన్నపూర్ణ స్టూడియోస్‌ ట్వీట్ చేసింది. దీంతో బన్నీ స్పీచ్‌ కోసం ఫ్యాన్స్‌ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. శివ మూవీ గురించి ఏం మాట్లాతారనే విషయంపై అభిమానులతో పాటు అందరిలోనూ ఆతృత నెలకొంది. కాగా.. ఈ  సినిమాను నవంబర్ 14న థియేటర్లలో రీ రిలీజ్ చేస్తున్నారు. 

కాగా.. నాగార్జున హీరోగా నటించిన ఈ చిత్రంలో అమల హీరోయిన్‌గా నటించారు.  కాలేజీలో విద్యార్థుల మధ్య గొడవలు, గ్యాంగ్‌లు, రాజకీయ నాయకులు తమ అవసరాల కోసం స్టూడెంట్స్‌ని ఎలా ఉపయోగించుకుంటారు? విద్యార్థుల మధ్య ఎలాంటి గొడవలు సృష్టిస్తారు? ఇలాంటి సామాజిక అంశాల నేపథ్యంలో ఈ సినిమాని తెరకెక్కించి సరికొత్త ట్రెండ్‌ని సృష్టించారు వర్మ.
 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement