మూడోసారి తెలుగు స్టార్ హీరోతో జోడీ?  | Allu Arjun And Pooja Hegde 3rd Time Doing Film, Interesting Deets Inside - Sakshi
Sakshi News home page

Allu Arjun-Pooja Hegde: మూడోసారి తెలుగు స్టార్ హీరోతో జోడీ? 

Published Fri, Mar 15 2024 3:05 AM | Last Updated on Fri, Mar 15 2024 11:08 AM

allu Arjun and Pooja Hegde 3dr time doing film - Sakshi

హీరో అల్లు అర్జున్, హీరోయిన్‌ పూజా హెగ్డే ముచ్చటగా మూడోసారి జోడీగా నటించనున్నారా? అంటే అవునంటోంది ఫిల్మ్‌నగర్‌ సర్కిల్‌. ఈ ఇద్దరూ ‘డీజే దువ్వాడ జగన్నాథమ్‌’ (2019), ‘అల వైకుంఠపురములో’ (2020) వంటి చిత్రాల్లో జంటగా నటించి, హిట్‌ పెయిర్‌గా నిలిచారు. ఇక 2002లో విడుదలైన ‘ఆచార్య’ తర్వాత మరో తెలుగు చిత్రంలో హీరోయిన్‌గా నటించలేదు పూజా హెగ్డే. అయితే ‘ఎఫ్‌ 3’ సినిమాలో వెంకటేశ్, వరుణ్‌ తేజ్‌లతో కలిసి ప్రత్యేకపాటలో కనిపించారు.

ఇప్పుడు కథానాయికగా అల్లు అర్జున్‌ సినిమాకి చాన్స్‌  దక్కించుకున్నట్లు సమాచారం. ప్రస్తుతం సుకుమార్‌ దర్శకత్వంలో ‘పుష్ప 2: ది రూల్‌’ సినిమాతో బిజీగా ఉన్నారు అల్లు అర్జున్‌. ఆ తర్వాత ఆయన పని చేయనున్న దర్శకుల జాబితాలో త్రివిక్రమ్, బోయపాటి శ్రీను, అట్లీ కుమార్, సందీప్‌ రెడ్డి వంగా పేర్లు వినిపిస్తున్నాయి. అయితే అట్లీతోనే తన తర్వాతి చిత్రం చేయనున్నారట అల్లు అర్జున్‌. ఈ చిత్రంలోనే పూజాహెగ్డే హీరోయిన్‌గా నటించనున్నట్లు సమాచారం. మరి.. అల్లు అర్జున్‌తో మూడోసారి హీరోయిన్‌గా నటించే అవకాశం పూజా హెగ్డేకి దక్కిందా అనే విషయంపై స్పష్టత రావాలంటే వేచి చూడాలి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
 
Advertisement
 
Advertisement