Alia Bhatt Heart Of Stone Trailer Telugu - Sakshi
Sakshi News home page

Alia Bhatt: విలన్‌గా ఆలియా భట్.. హాలీవుడ్ ఎంట్రీ మాత్రం!

Jun 18 2023 3:31 PM | Updated on Jul 31 2023 8:35 PM

Alia Bhatt Heart Of Stone Trailer Telugu - Sakshi

బాలీవుడ్ లో చాలామంది స్టార్స్ తో పోలిస్తే ఆలియా భట్ స్పెషల్. ఎందుకంటే టీనేజ్ లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఫస్ట్ మూవీతోనే సూపర్ హిట్ కొట్టింది. అందరిలానే ఈమెని కూడా నెపోటిజం కిడ్ అని ట్రోల్స్ చేశారు. కానీ అవేవీ ఈమె సక్సెస్ ని ఆపలేకపోయాయి. దీంతో ఇండియాలోనే టాప్ మోస్ట్ హీరోయిన్స్ లో ఒకరిగా గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పుడు ఏకంగా హాలీవుడ్ లోనూ అదరగొట్టేందుకు రెడీ అయిపోయింది.

ఆలియా హాలీవుడ్ ఎంట్రీ

ఇప్పటివరకు 20కి పైగా హిందీ సినిమాల్లో నటించిన ఆలియా.. రాజమౌళి తీసిన 'ఆర్ఆర్ఆర్'లోనూ హీరోయిన్ గా నటించింది. అలా తెలుగు ప్రేక్షకులకు ఈమె పరిచయమే. హాలీవుడ్ లో 'హార్ట్ ఆఫ్ స్టోన్' అనే మూవీ చేస్తోంది. అక్కడ ఆలియాకు ఇదే ఫస్ట్ మూవీ. చానాళ‍్ల క్రితమే షూటింగ్ పూర్తి చేసిన ఈ సినిమాని ఆగస్టు 11న నెట్ ఫ్లిక్స్ లో రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. తాజాగా తెలుగు ట్రైలర్ ని విడుదల చేశారు.

(ఇదీ చదవండి: కోర్టులో లొంగిపోయిన హీరోయిన్ అమీషా పటేల్!)

క్యూటెస్ట్ విలన్ గా ఆలియా!

మన దగ్గర హీరోయిన్ గా అలరించిన ఆలియా.. హాలీవుడ్ ఎంట్రీ మాత్రం క్యూటెస్ట్ విలన్ గా ఇచ్చింది. తాజాగా రిలీజ్ చేసిన ట్రైలర్ లో ఈమె సీన్స్ సమ్ థింగ్ ఇంట్రెస్టింగ్ అనేలా ఉన్నాయి. యాక్షన్ సీన్స్, డైలాగ్స్ తో వావ్ అనిపించింది. ఈ మూవీ ఆలియాకు చాలా స‍్పెషల్. ఎందుకంటే ప్రెగ్నెన్సీతో ఉన్న టైంలోనే షూటింగ్ లో పాల్గొని, సక్సెస్ ఫుల్ గా పూర్తి చేసింది. 

'హార్ట్ ఆఫ్ స్టోన్' స్టోరీ ఏంటి?

దేశాన్ని ప‍్రమాదాల బారినుంచి రక్షించేందుకు 'చార్టర్' అనే ఓ సీక్రెట్ టీమ్ పనిచేస్తుంటుంది. దీనికి రాచెల్ స్టోన్(గాల్ గాటోడ్) లీడర్. దేశానికి ఇబ్బందికర పరిస్థితి తలెత్తినప్పుడు ఈ టీమ్ దాన్ని సరిచేస్తుంటారు. 'ది హార్ట్' అని పిలిచే ఓ మాక్ గఫిన్ కోసం వీరు వెతుకుతూ ఉంటారు. మరో టీమ్ కూడా దీనికోసమే సెర్చ్ చేస్తూ ఉంటుంది. 'ది హార్ట్' కోసం రెండు టీమ్స్ పోటీ పడుతుంటే.. ఆలియా భట్ రోల్ కూడా ఎంట్రీ ఇస్తుంది. చివరకు ఏమైందనేదే ఈ మూవీ స్టోరీ.

(ఇదీ చదవండి: 'ఆదిపురుష్' మూవీ.. ప్రభాస్ అందుకే సైలెంట్‌గా ఉన్నాడా?)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement