ఇళయరాజా ఫిర్యాదు.. నెట్‌ఫ్లిక్స్‌ నుంచి అజిత్‌ మూవీ తొలగింపు | Ajith Kumar's Good Bad Ugly Movie Removed From Netflix Over Ilayaraja Copyright Dispute | Sakshi
Sakshi News home page

ఇళయరాజా ఫిర్యాదు.. నెట్‌ఫ్లిక్స్‌ నుంచి అజిత్‌ మూవీ తొలగింపు

Sep 17 2025 12:21 PM | Updated on Sep 17 2025 12:36 PM

Ajith Kumar's Good Bad Ugly Movie Removed From Netflix Over Ilayaraja Copyright Dispute

సంగీత దర్శ‍కుడు ఇళయరాజా ఫిర్యాదు కారణంగా నెట్‌ఫ్లిక్స్‌ నుంచి అజిత్‌ కుమార్‌ నటించిన ‘గుడ్‌ బ్యాడ్‌ అగ్లీ’ మూవీ తొలగించారు. అధిక్‌ రవిచంద్రన్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో అనుమతి లేకుండా తన పాటలను ఉపయోగించారంటూ ఇళయరాజా కోర్టులో పిటిషన్‌ వేశారు. కాపీరైట్‌ చట్టానికి ఇది విరుద్దమని, ఆ పాటలను తొలగించడమే కాకుండా.. ఉపయోగించినందుకుగానూ తనకు పరిహారం ఇవ్వాలని ఇళయరాజా కోరారు. దీనిపై విచారణ జరిపిన మద్రాసు కోర్టు.. ఇళయరాజా పాటలను సినిమాలో ప్రదర్శించొద్దంటూ ఉత్తర్వులు జారీ చేసింది. కోర్టు ఆదేశాలతో   నెట్‌ఫ్లిక్స్‌ సంస్థ ఈ చిత్రాన్ని తొలగించింది. పాటలను తొలగించి..మళ్లీ సినిమాను అందుబాటులోకి తీసుకొస్తారా లేదా మొత్తానికి స్ట్రీమింగ్‌ చేయకుండా వదిలేస్తారో చూడాలి.

కాగా,ఈ వివాదం గురించి చిత్ర నిర్మాత రవి గతంలో మాట్లాడుతూ.. ఇళయరాజా పాటలకు సంబంధించి అన్ని అనుమతులు తీసుకున్నామని, నిబంధనలకు అనుగుణంగానే పాటలను ఉపయోగించామని చెప్పారు. 

ఈ ఏడాది ఏప్రిల్‌లో థియేటర్స్‌లో విడుదలైన ఈ చిత్రం దాదాపు రూ. 250 కోట్లకు పైగా వసూళ్లను సాధించి రికార్డు సృష్టించింది. ఈ ఏడాది మే 8 నుంచి ఓటీటీలోకి అందుబాటులోకి వచ్చింది. తెలుగు,హిందీ,తమిళ్‌, కన్నడ, మలయాళ భాషల్లో స్ట్రీమింగ్‌ అయిన ఈ చిత్రం.. ఇప్పుడు కోర్డు ఆదేశాలతో సడెన్‌గా నెట్‌ఫ్లిక్స్‌ నుంచి తొలగించారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement