హీరోయిన్‌ ఓరియంటెడ్‌ మూవీలో ఐశ్వర్య.. | Sakshi
Sakshi News home page

Aishwarya Rajesh: మరోసారి ప్రయోగానికి సిద్ధమైన తెలుగు హీరోయిన్‌

Published Mon, Mar 4 2024 7:56 AM

Aishwarya Rajesh Valayam Movie Launched - Sakshi

హీరోయిన్‌ ఐశ్వర్య రాజేష్‌ మరోసారి లేడీ ఓరియంటెడ్‌ కథా చిత్రంలో నటిస్తున్నారు. యాక్సెస్‌ ఫిలిం ఫ్యాక్టరీ పతాకంపై ఢిల్లీబాబు ఈ చిత్రం నిర్మిస్తున్నారు. న్యూ టాలెంట్‌ను ప్రోత్సహించడానికి ఎప్పుడూ ముందుండే ఈయన వరుసగా పది జనరంజకమైన కథా చిత్రాలను నిర్మించి విజయాలను అందుకున్నారు. అలా ఇంతకుముందు యాక్సెస్‌ ఫిలిం ఫ్యాక్టరీ పతాకంపై మరకత నాణయం, రాక్షసన్‌, ఓ మై కడవులే, బ్యాచిలర్‌ వంటి పలు విజయవంతమైన చిత్రాలు రూపొందాయి.

తాజాగా ఈ సంస్థ నిర్మిస్తున్న వలయం చిత్రం ద్వారా భారతి దర్శకుడుగా పరిచయం అవుతున్నారు. డీజీ వైష్ణవ్‌ కాలేజ్‌ విద్యార్థి అయిన ఈయన టీవీ ఛానెళ్లు, మీడియా హౌస్‌లలో పనిచేసి, పలు షార్ట్‌ ఫిలిమ్స్‌ రూపొందించారు. కాగా వలయం చిత్రంలో ఐశ్వర్య రాజేష్‌తో పాటు నటుడు దేవ్‌ ముఖ్య పాత్రను చేస్తున్నారు. నటుడు చేతన్‌, తమిళ్‌, ప్రదీప్‌ రుద్ర, హరీష్‌ పేరడీ, సురేష్‌ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.

యాక్షన్‌ థ్రిల్లర్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్ర షూటింగ్‌ శనివారం చైన్నెలో పూజా కార్యక్రమంతో ప్రారంభమైంది. చిత్ర షూటింగ్‌ను చైన్నె చుట్టుపక్కల ప్రాంతాల్లో నిర్వహిస్తున్నట్లు నిర్మాత ఢిల్లీబాబు తెలిపారు. ఈ చిత్రానికి ప్రతిభావంతులైన నటీనటులు, సాంకేతిక వర్గం పని చేస్తున్నారని పేర్కొన్నారు. దీనికి ప్రముఖ ఛాయాగ్రాహకుడు వేల్‌ రాజ్‌ శిష్యుడు మహేంద్ర ఎం.హెండ్రీ ఛాయాగ్రాహకుడిగా పరిచయం అవుతుండగా మైఖెల్‌ బ్రిట్టో సంగీతాన్ని అందిస్తున్నారు.

చదవండి: సమంతకు రీ ఎంట్రీలోనే బిగ్‌ ఆఫర్‌.. ఆ హీరోకు కూడా ఇదే చివరి సినిమా

Advertisement
 
Advertisement

తప్పక చదవండి

 
Advertisement