Manchu Lakshmi Shares New Pics Of Manchu Manoj And Bhuma Mounika Ahead Of Marriage - Sakshi
Sakshi News home page

Manchu Manoj Marriage: పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు.. ఎంత ముచ్చటగా ఉన్నారో!

Mar 3 2023 6:34 PM | Updated on Mar 3 2023 6:59 PM

The Adorable Couple Manchu Manoj and Mounika New Pics - Sakshi

తాళి కట్టే ముహూర్తానికి ఇంకా కొంత సమయం మాత్రమే మిగిలి ఉంది. దీంతో మనోజ్‌ను పెళ్లికొడుకుగా ముస్తాబు చేస్తున్నా

పెళ్లితో కొత్త జీవితాన్ని ఆరంభించనున్నారు మంచు మనోజ్‌, భూమా మౌనిక. స్నేహంతో మొదలైన వారి ప్రయాణం మొదటగా ప్రేమగా మారగా నేడు మూడు ముళ్లబంధంతో భార్యాభర్తలుగా మారనున్నారు. ఈ క్షణం కోసం వారిద్దరే కాదు, అభిమానులు సైతం ఆత్రంగా ఎదురుచూస్తున్నారు. అటు మంచు లక్ష్మి అన్నీ తానై పెళ్లిపెద్దగా మారి తమ్ముడి వివాహం జరిపిస్తోంది. తన ఇంట్లోనే ఈ శుభాకార్యాన్ని ఏర్పాటు చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది.


పెళ్లికి హాజరైన డిజైనర్‌ శిల్పారెడ్డి

తాళి కట్టే ముహూర్తానికి ఇంకా కొంత సమయం మాత్రమే మిగిలి ఉంది. దీంతో మనోజ్‌ను పెళ్లికొడుకుగా ముస్తాబు చేస్తున్నారు. ఈ ఫోటోను మంచు లక్ష్మి సోషల్‌ మీడియాలో వదలగా క్షణాల్లో అది వైరల్‌గా మారింది. ఇది చూసిన ఫ్యాన్స్‌ మనోజ్‌ ముఖంలో పెళ్లి కళ ఉట్టిపడుతోందంటూ కామెంట్లు చేస్తున్నారు. కాగా కాసేపటి క్రితం మనోజ్‌ సైతం పెళ్లికూతురు అంటూ మౌనిక ఫోటోను సోషల్‌ మీడియాలో షేర్‌ చేశాడు. ఇద్దరి జంట చూడముచ్చటగా ఉందంటున్నారు నెటిజన్లు.

Advertisement
 
Advertisement
Advertisement