Adipurush Movie: Kriti Sanon As Sita Poster Released Trending On Social Media - Sakshi
Sakshi News home page

Adipurush Movie Sita Look: ఆదిపురుష్‌ నుంచి జానకి టీజర్‌.. చూశారా?

Apr 29 2023 9:16 AM | Updated on Apr 29 2023 11:55 AM

Adipurush Movie: Kriti Sanon as Sita Poster Released - Sakshi

ఈసారి మాత్రం సీత నుదుటన సింధూరం, చేతికి గాజులతో నిండుగా కనిపిస్తోంది.

శ్రీరాముడిగా ప్రభాస్‌, జానకిగా కృతి సనన్‌, రావణాసురుడిగా సైఫ్‌ అలీ ఖాన్‌ నటించిన చిత్రం ఆదిపురుష్‌. ఓం రౌత్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా దాదాపు రూ.500 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోంది. రామాయణం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమా నుంచి తాజాగా జానకి పోస్టర్‌ రిలీజ్‌ చేశారు. శనివారం (ఏప్రిల్‌ 29) సీతా నవమిని పురస్కరించుకుని పోస్టర్‌తో పాటు చిన్నపాటి టీజర్‌ సైతం విడుదల చేశారు. గతంలో సీత చేతికి గాజులు, పాపిట సింధూరం లేకుండా ఏదో తూతూమంత్రంగా పోస్టర్‌ రిలీజ్‌ చేశారు. కానీ ఈసారి మాత్రం జానకి పాపిట సింధూరం, చేతికి గాజులతో నిండుగా కనిపిస్తోంది. ఓ కంట కన్నీరు కారుస్తూ రాముడి కోసం ఎదురుచూస్తున్నట్లుగా ఉంది.

కాగా భూషణ్‌ కుమార్‌, క్రిషణ్‌ కుమార్‌, ఓం రౌత్‌, ప్రసాద్‌ సుతార్‌, రాజేశ్‌ నాయర్‌, వంశీ, ప్రమోద్‌ నిర్మించిన ఈ చిత్రం జూన్‌ 16న విడుదల కానుంది. ఇకపోతే న్యూయార్క్‌లోని ట్రిబెకా ఫిలిం ఫెస్టివల్‌లో ఆదిపురుష్‌ వరల్డ్‌ ప్రీమియర్‌ను ప్రదర్శించనున్న సంగతి తెలిసిందే! జూన్‌ 7 నుంచి 18 వరకు జరిగే ట్రిబెకా ఫెస్టివల్‌లో భాగంగా జూన్‌ 13న ఆదిపురుష్‌ సినిమా వరల్డ్‌ ప్రీమియర్‌(త్రీడీ) ప్రదర్శించనున్నారు.

చదవండి: హీరోయిన్‌కు కలిసిరాని ప్రేమ.. ఒకరు వన్‌సైడ్‌ లవ్‌.. మరొకరు..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement