అప్పుడే నేను ప్రశాంతంగా ఉంటా: త్రిష | Actress Trisha Comments Her Sleeping And Life Functions Sparks Buzz Amid Political Rumours, Read Story Inside | Sakshi
Sakshi News home page

అప్పుడే నేను ప్రశాంతంగా ఉంటా: త్రిష

Apr 30 2026 9:01 AM | Updated on Apr 30 2026 9:40 AM

Actress Trisha Coments Her Sleeping And Life functions

ఇటీవల సెంటర్‌ ఆఫ్‌ ది మీడియాగా మారిన నటి త్రిష.. చిత్ర పరిశ్రమలోనే కాకుండా రాజకీయ రంగంలోనూ హాట్‌టాపిక్‌గా మారారు. దీంతో ఆమె సోషల్‌మీడియాలో ట్రెండింగ్‌లో కొనసాగుతుంది. రెండు దశాబ్దాలకు పైగా దక్షిణాది ఇండస్ట్రీలో టాప్‌ హీరోయిన్‌గా రాణిస్తున్న  త్రిష..  కోలీవుడ్‌లోని అతి కొద్దిమంది మోస్టెస్ట్‌ బ్యాచిలర్‌ నటీమణుల్లో ఒకరు. ఈ విషయం కూడా ఈమెను వార్తల్లో నిలబెట్టడానికి ఒక కారణం కావచ్చు. 

నటుడు, తమిళగ వెట్రికళగం పార్టీ అధ్యక్షుడు విజయ్‌ ఫ్రెండ్‌ కావడంతో ఈమె రాజకీయాల్లోనూ ఎక్కువగా నానుతున్నారు. దీంతో త్రిష రాజకీయ రంగ ప్రవేశానికి సిద్ధం అవుతున్నారని, సినిమాలకు గుడ్‌బై చెప్పబోతున్నారని ప్రచారం జోరుగా సాగింది. అయితే నటనకు స్వస్తి చెప్పడం లేదని చెప్పే విధంగా ఇటీవలే ఒక తెలుగు చిత్రంలో నటించడానికి కమిట్‌ అయ్యారు. ఈమె మిత్రులతో కలిసి ఎంజాయ్‌ చేసే ఫొటోలు తరచూ సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతుంటాయి. త్రిష రాత్రి వేళ మేలుకుని ఉంటారనే ప్రచారం ఉంది. 

ఇటీవల త్రిష తన ఇన్‌స్ట్రాగామ్‌లో ఒక పోస్ట్‌ పెట్టారు. అందులో గంట నిద్ర కోల్పోతే, దాని నుంచి రికవరీ అవడానికి 4 రోజులు పడుతుంది. ఈ ప్రకారం లెక్కలు కడితే 2062 సంవత్సరంలోనే నేను ప్రశాంతంగా జీవిస్తాననే భావన కలుగుతోంది అని పేర్కొన్నారు. దీంతో త్రిష మాటల్లో అర్థం ఏమిటి ? అనే చర్చ జరుగుతోంది. త్రిషకు సరిగా నిద్ర పట్టడం లేదా, ఆమె మానసిక రుగ్మతకు లోనౌతున్నారా..? వంటి ప్రశ్నలను నెటిజన్లు లేవనెత్తున్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement