Actress Samyuktha Menon Interesting Comments in Latest Interview - Sakshi
Sakshi News home page

Samyuktha Menon: సినిమాలపై ఆసక్తి లేదు.. కానీ విధే ఇక్కడ నిలబెట్టింది: హీరోయిన్‌ సంయుక్త

Feb 22 2023 9:15 AM | Updated on Feb 22 2023 10:06 AM

Actress Samyuktha Menon Interesting Comments in Latest Interview - Sakshi

ధనుష్‌ కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం వాత్తీ. తమిళం, తెలుగు భాషల్లో రూపొందిన ఈ చిత్రం తెలుగులో సార్‌ అనే పేరుతో విడుదలైంది. ఈ చిత్రంలో మలయాళ నటి సంయుక్త హీరోయిన్‌గా నటించారు. ఈ నెల 17న ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయం సాధించింది. చక్కని సామాజిక పరమైన ఇతివృత్తంతో కమర్షియల్‌ ఫార్ములాలో రూపొందిన వాత్తీ చిత్రంలో ధనుష్‌ నటనతో పాటు నటి సంయుక్త నటనకు ప్రశంసలు లభిస్తున్నాయి. ఇక నటి సంయుక్త ఇప్పటికే మలయాళం, తెలుగు చిత్రాలు నటిస్తూ పేరు తెచ్చుకున్నారు.

చదవండి: నటుడు ప్రభుకి తీవ్ర అస్వస్థత, ఆస్పత్రిలో చేరిక

ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తాను కేరళ రాష్ట్రంలోని చిన్న గ్రామంలో పుట్టానని చెప్పారు. సినిమాపై పెద్దగా ఆసక్తి లేకపోయినా తన చుట్టూ ఉన్నవారితో ఏదో ఒక చిత్రంలో నటించానని చెప్పుకోవాలని ఆశపడ్డానన్నారు. అలా ఒక చిత్రంలో నటించిన తర్వాత ఇక చాలు అనుకొని చదువుపై దృష్టి పెట్టానన్నారు. అలా సినిమాలకు ఏడాది దూరమయ్యానని పేర్కొన్నారు. అయితే విధి తనను మళ్లీ సినిమాల్లోకే తీసుకొచ్చి నిలబెట్టిందన్నారు. అలా నటిస్తూ సినిమాను ప్రేమించడం మొదలుపెట్టినట్లు చెప్పారు. ఇప్పుడు సినిమానే జీవితంగా మారిపోయిందన్నారు. నటిగా వైవిద్యభరిత కథాపాత్రలు పోషించాలని ఆశిస్తున్నారని, వాత్తీ చిత్రంలో ధనుష్‌కు జంటగా నటించడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement