నాకు నత్తి.. ఇప్పటికీ బాధపడుతుంటా: సమీరా రెడ్డి | Actress Sameera Reddy about her Stammering Issue | Sakshi
Sakshi News home page

చిన్నప్పుడు నత్తి.. హేళన చేసేవారు, నాపై నాకే డౌట్‌!

Mar 24 2026 7:23 AM | Updated on Mar 24 2026 7:23 AM

Actress Sameera Reddy about her Stammering Issue

హీరోయిన్‌ సమీరారెడ్డి ఏదైనా నిర్మొహమాటంగా చెప్పేస్తుంది. తన కష్టాలు, ప్రెగ్నెన్సీలో బరువు పెరగడం, డెలివరీ తర్వాత ఎదుర్కొన్న సమస్యలు.. వీటన్నింటి గురించి ఓపెన్‌గా మాట్లడుతూ ఉంటుంది. అయితే చిన్నతనంలో నత్తి వల్ల తనను ఎందరో వెక్కిరించేవారంటోంది.

వెక్కిరింతలు
తాజాగా ఓ ఇంటర్వ్యూలో సమీరా రెడ్డి మాట్లాడుతూ.. చిన్నప్పుడు నాకు నత్తి ఉండేది. దానివల్ల నన్ను వెక్కిరిస్తూ వేధించేవారు. నాలో ఆత్మవిశ్వాసం పెంచుకోవడానికి సంవత్సరాల తరబడి థెరపీ చేయించుకోవాల్సి వచ్చింది. ఇప్పటికీ నేను నత్తిగా మాట్లాడినప్పుడు ఎవరైనా దానిపై సెటైర్లు వేస్తే బాధగా ఉంటుంది. చిన్ననాడు మనల్ని ఏమేం అంటారో అవన్నీ మనసులో లోతుగా పాతుకుపోయుంటాయి.

అదే నిజమనుకుని..
ఉదాహరణకు.. ఆమె చాలా స్లో, వీక్‌ అంటుంటారు. ఇలాంటి పదాలు పదేపదే విన్నప్పుడు మనపై మనకే అనుమానం వేస్తుంటుంది. ఫలితంగా పిల్లలు ఏదైనా సాహసం చేసేందుకు వెనుకాడతారు. పిల్లల్ని పదేపదే బుద్ధిహీనుడు, బలహీనుడు, ముసలివాడు.. అని పిలిస్తే వాళ్లు అదే నిజమనుకుంటారు. వాళ్లను వాళ్లు చూసుకునే విధానమే మారిపోతుంది. 

ఎవరినీ కించపర్చొద్దు
అదే నిజమని నమ్మి, అందరిలా దూకుడుగా ఉండలేరు. ఏవీ ప్రయత్నించకుండా సైలెంట్‌ అయిపోయే ప్రమాదం ఉంది. నా పిల్లలు.. వారికి ఏ సమస్య ఎదురైనా నాతో చెప్పమంటాను. ఎవరినీ కించపరచొద్దని చెప్తుంటాను. పిల్లలకు సరైన ప్రోత్సాహం, మార్గదర్శకత్వం చేస్తే మంచి ఆత్మవిశ్వాసంతో ఎదుగుతారు. 

పర్సనల్‌ లైఫ్‌
తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, తోటివారంతా సపోర్ట్‌గా నిలబడితే పిల్లలు వారికెదురయ్యే సవాళ్లను ఒక అడ్డంకిగా కాకుండా.. దాన్నుంచి ఎలా బయటపడాలన్నది నేర్చుకుంటారు అని చెప్పుకొచ్చింది. సమీరా.. 2014లో ఎంటర్‌ప్రెన్యూర్‌ అక్షయ్‌ వార్డేను పెళ్లి చేసుకుంది. ఈ దంపతులకు 2015లో కుమారుడు హన్స్‌, 2019లో కూతురు నైరా జన్మించారు. బాలీవుడ్‌ హీరోయిన్‌ సమీరా రెడ్డి.. తెలుగులో నరసింహుడు, జై చిరంజీవ, అశోక్‌ సినిమాల్లో నటించింది.

చదవండి: హీరోయిన్‌ భానుప్రియ ఇంట తీవ్ర విషాదం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement