ప్రియుడి మీద వాలిపోయిన పాయల్‌, వైరలవుతున్న ఫొటో!

Actress Payal Rajput Close Pic With Her Boy Friend Saurabh Dhingra Goes Viral - Sakshi

ఆర్‌ఎక్స్‌ 100 సినిమాతో కుర్రకారుల గుండెల్లో ప్రేమముళ్లు దింపిందీ పాయల్‌ రాజ్‌పుత్‌. ఈ సినిమా ఎంతో పెద్ద హిట్టవ్వడమే కాదు ఆమెకు అవకాశాలను కూడా తెచ్చిపెట్టింది. అలా వెంకీమామ, డిస్కో రాజా, అనగనగా ఓ అతిథి వంటి చిత్రాల్లో మెరిసింది. ఈ మధ్య సినిమాల్లో కంటే సోషల్‌ మీడియాలో ఎక్కువగా కనిపిస్తున్న ఈ భామ తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీస్‌లో బాయ్‌ఫ్రెండ్‌తో ఉన్న ఫొటోను షేర్‌ చేసింది. తన ప్రియుడు సౌరభ్‌ డింగ్రాతో సెల్ఫీ దిగిన ఫొటోను పంచుకుంది. ఇందులో ఆమె అతడి భుజం మీద వాలిపోయింది.

ప్రస్తుతం ఆమె ఓ పంజాబీ సినిమా చేస్తోంది. ఈ క్రమంలో షూటింగ్‌ నిమిత్తం ఆమె ప్రియుడిని వెంటబెట్టుకుని మరీ పంజాబ్‌కు వెళ్లినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో వీళ్లిద్దరూ అక్కడ ఒకే హోటల్‌లో ఉంటున్నారని జనాలు చెవులు కొరుక్కుంటున్నారు. ఇంతలోనే ఈ భామ ఏకంగా ప్రియుడితో హోటల్‌ రూమ్‌లో కలిసి దిగిన ఫొటోను షేర్‌ చేసి అందరికీ ఝలక్కిచ్చింది.

చదవండి: 'ప్లీజ్‌ పాయల్‌ నెంబర్‌ చెప్పండి', హీరోయిన్‌ ఆన్సర్‌ ఇదే

ఆన్‌లైన్‌లో లీకైన ‘పుష్ప’ స్టోరీ, సుక్కుపై ట్రోల్స్‌!

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top